అన్వేషించండి

Tripti Dimri: లకలకలకలక... బాలీవుడ్ హారర్ ఫ్రాంచైజీలో 'యానిమల్' బ్యూటీకి ఛాన్స్

Bhool Bhulaiyaa 3 update: తమిళ, తెలుగు భాషల్లో 'చంద్రముఖి' సూపర్ హిట్. ఆ సినిమాను హిందీలో 'భూల్ భులయ్యా' పేరుతో రీమేక్ చేశారు. తర్వాత సీక్వెల్ చేశారు. ఇప్పుడు మూడో పార్ట్ చేస్తున్నారు.

Animal fame Tripti Dimri and Kartik Aaryan team up for Bhool Bhulaiyaa 3: 'యానిమల్'తో ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి చాలా పాపులర్ అయ్యారు. ఆమెను Bhabhi 2 అంటూ పిలవడం స్టార్ట్ చేసిన ప్రేక్షకులు ఎంతో మంది! ఒక్క సినిమాతో తృప్తి విపరీతంగా వైరల్ అయ్యారు. 'యానిమల్'లో రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇప్పుడు ఆ సినిమా గతం! తృప్తి చేస్తున్న కొత్త సినిమాలు ఏమిటి? అని చూస్తే... కార్తీక్ ఆర్యన్ సరసన 'భూల్ భులాయ్యా'లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. 

'భూల్ భులాయ్యా 3'లో తృప్తి దిమ్రి
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా... జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'చంద్రముఖి' తమిళ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా 'భూల్ భులయ్యా' పేరుతో రీమేక్ చేశారు. అంతే కాదు... కార్తీక్ ఆర్యన్ హీరోగా ' భూల్ భులయ్యా 2' పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా చేశారు. ఇప్పుడు 'భూల్ భులయ్యా 3' తెరకెక్కిస్తున్నారు. అందులో తృప్తి దిమ్రి నటిస్తున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశారు.

Also Read: యువ కథానాయకుడి ఇంటికి వారసుడొచ్చాడు - పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య
 
'వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్  భూల్ భులయ్యా'' అంటూ తృప్తి దిమ్రికి స్వాగతం పలికారు హీరో కార్తీక్ ఆర్యన్. ''ఆమె చిరునవ్వు ఎంతో మంది గుండెల్లో భయం కలిగిస్తుంది. తృప్తి రాకతో థ్రిల్స్, చిల్స్ మరింత పెరుగుతాయి'' అని టీ సిరీస్ పేర్కొంది. 'భూల్ భులయ్యా 3' చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'యానిమల్' సినిమా నిర్మాతలలో ఆయన కూడా ఒకరు.
Tripti Dimri: లకలకలకలక... బాలీవుడ్ హారర్ ఫ్రాంచైజీలో 'యానిమల్' బ్యూటీకి ఛాన్స్

'భూల్ భులయ్యా 3'లో విద్యా బాలన్ కూడా!
అక్షయ్ కుమార్ 'భూల్ భులయ్యా' సినిమాలో విద్యా బాలన్ నటించారు. తెలుగులో జ్యోతిక చేసిన పాత్రను పోషించారు. అయితే, సీక్వెల్ ఆమె చేయలేదు. కార్తీక్ ఆర్యన్ 'భూల్ భులయ్యా 2'లో టబు నటించారు. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. అయితే.. ఇప్పుడు మూడో పార్ట్ 'భూల్ భులయ్యా 3'కు వచ్చేసరికి మళ్లీ విద్యా బాలన్ (Vidya Balan)ను తీసుకున్నారు. దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది.

Also Readఆస్కార్స్‌ అవార్డుల్లో 13 నామినేషన్స్... బాఫ్టాలో 7 అవార్డ్స్... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

'యానిమల్' తర్వాత మరో రెండు సినిమాలు చేసిన తృప్తి!
'యానిమల్' తర్వాత తృప్తి దిమ్రి నటించిన సినిమాలు ఏవీ విడుదల కాలేదు. కానీ, ఆ సినిమా తర్వాత ఆవిడ మరో రెండు సినిమాలకు సంతకం చేశారు. అందులో బాలీవుడ్ యంగ్ హీరో, మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ రాజ్ కుమార్ రావు జోడీగా నటిస్తున్న సినిమా ఒకటి ఉంది. 'విక్కీ వైద్య హా వో వాలా వీడియో'లో ఆయన సరసన తృప్తి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. దీనికి ముందు విక్కీ కౌశల్ జోడీగా 'మేరే మెహబూబ్ మేరే సనమ్' సినిమా చేశారు. అందులో సాన్య మల్హోత్రా మరొక హీరోయిన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
Tillu Cube: రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?
రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?
SLBC Tunnel Recue operation: చివరి దశకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
SLBC Tunnel Recue operation: చివరి దశకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
Tillu Cube: రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?
రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?
SLBC Tunnel Recue operation: చివరి దశకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
SLBC Tunnel Recue operation: చివరి దశకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
GV Reddy Shocking Comments: రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన పోస్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన పోస్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
Gas Cylinder Price Hike: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు
పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు
Stock Market Crash: '1996 పీడకల' రిపీట్‌ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్‌ మార్కెట్‌లో ఒకటే టెన్షన్‌
'1996 పీడకల' రిపీట్‌ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్‌ మార్కెట్‌లో ఒకటే టెన్షన్‌
Mad Square: పవన్ సినిమా వస్తే మా సినిమా రాదు... 'మ్యాడ్ స్క్వేర్' విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ
పవన్ సినిమా వస్తే మా సినిమా రాదు... 'మ్యాడ్ స్క్వేర్' విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ
Embed widget