'భగవంత్ కేసరి' ట్రైలర్ లోడింగ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ డేట్ తో పాటు తాజాగా టైమ్ ని కూడా ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించి మరో స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు.
నేలకొండ భగవంత్ కేసరిగా గర్జించేందుకు సిద్ధమయ్యాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. అక్టోబర్ 8న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఓ పోస్టర్ ద్వారా వెల్లడించగా తాజాగా ట్రైలర్ డేట్ తో పాటు టైం ని కూడా ఫిక్స్ చేశారు. 'భగవంత్ కేసరి' ట్రైలర్ కి సంబంధించిన పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మరో స్పెషల్ పోస్టర్తో అప్డేట్ ఇచ్చారు. ఆ పోస్టర్లో ట్రైలర్ టైమ్ కూడా ఫిష్ చేశారు. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి హిట్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకొని సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా మరో యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన 'గణేష్ ఆంథమ్', 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
The world of #BhagavanthKesari
— Anil Ravipudi (@AnilRavipudi) October 6, 2023
LOCKED & LOADED 🌍🔥
Over to brother @MusicThaman 🥁
Trailer on 8th Oct at 8:16 PM 🤗
IN CINEMAS OCT 19th❤️🔥#NandamuriBalakrishna garu @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @Shine_Screens @sahugarapati7 @harish_peddi @YoursSKrishna… pic.twitter.com/UqsCiKIeSL
ఈ మూవీ ట్రైలర్ ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మూవీ టీం తాజాగా మరో స్పెషల్ పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ టైం ని కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 8 రాత్రి 8 గంటల 16 నిమిషాలకు 'భగవంత్ కేసరి' ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు మూవీ టీం స్పెషల్ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్లో 'లాక్డ్ అండ్ లోడెడ్' అనే క్యాప్షన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి విక్టరీ సింబల్ ని చూపిస్తూ ఉండగా, బ్యాక్ సైడ్ లో ఓ పాప బొమ్మతో పాటు ప్రపంచ గ్లోబ్ ని చూపించారు. సినిమాలో అనిల్ రావిపూడి బాలయ్యను నెవర్ బిఫోర్ అవతారంలో చూపించనున్నాడు.
ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ఐతే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఇప్పటికే టీజర్ లో ఆ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పకనే చెప్పారు. కచ్చితంగా ఈ మూవీతో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటికే సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటివరకు కమర్షియల్ కథలలో కామెడీని హైలెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఫర్ ది ఫస్ట్ టైం బాలయ్య కోసం తన పంథాను మార్చుకొని ఈ సినిమాలో కామెడీ తో పాటు కొన్ని సోషల్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేయబోతున్నారట. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read : నన్ను రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అని సౌందర్య చిరంజీవికి చెప్పింది: నటుడు సత్య ప్రకాష్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial