Suma : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
Suma Reaction On Rumours : టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సుమ రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌లో తన కెరీర్, రాజీవ్‌తో పెళ్లి, డివోర్స్ రూమర్స్ వంటి విషయాల గురించి రియాక్ట్ అయ్యారు.

Anchor Suma Reaction About Divorce Rumours With Rajeev Kanakala : తన యాంకరింగ్, యాక్టింగ్‌తో బుల్లితెరతో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు సుమ. పలు టీవీ షోలతో పాటు టాప్ హీరోస్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు యాంకర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సుమ పేరే. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన కెరీర్, పర్సనల్ లైఫ్, రాజీవ్ కనకాలతో లవ్, డివోర్స్ రూమర్స్ వంటి అంశాలపై స్పందించారు.
డివోర్స్ రూమర్స్‌పై...
గతంలో చాలాసార్లు తన భర్త రాజీవ్ కనకాలతో సుమ డివోర్స్ అంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఈ అంశంపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చినా రూమర్లు మాత్రం ఆగలేదు. తాజాగా ఈ అంశంపై మరోసారి సుమ రియాక్ట్ అయ్యారు. 'మా పెళ్లి జరిగి 25 ఏళ్లు అవుతుంది. ఓ బంధంలో ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. రాజీవ్ కెరీర్, నా కెరీర్, పిల్లలు, తల్లిదండ్రులు... ఇలా అందరినీ చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలోనే ఏదో ఒక పాయింట్ దగ్గర మనస్పర్థలు రావడం సహజం.
జీవితం ఎవరికీ సాఫీగా ఉండదు. అప్పుడప్పుడూ ఏవేవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇది ఒక రోలర్ కోస్టర్ వంటిది. ఓ టైంలో నేను రాజీవ్‌తో ఉండడం లేదని, డివోర్స్ తీసుకున్నాననే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసినా అది ఆగలేదు. మీరిద్దరూ కలిసే ఉన్నారా? ఇంకా విడిపోలేదా? అనే కామెంట్స్ వచ్చాయి. అలాంటి వాటిని ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను.' అని తెలిపారు.
Also Read : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' - చేతబడి కథ... ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్
రాజీవ్‌కు యాక్సిడెంట్...
తనకు వచ్చిన కలలు చాలా వరకు నిజమయ్యాయని చెప్పారు సుమ. ఓసారి రాజీవ్‌కు యాక్సిడెంట్ జరిగిందని... అది తనకు ముందే కల వచ్చిందని అన్నారు. 'ఓసారి మేము గుడికి వెళ్లినట్లు కల వచ్చింది. అనుకోకుండా ఆ తర్వాత రోజు అదే గుడికి వెళ్లాం. ఆ తర్వాత ఓ విమానం కూలిపోయినట్లు కల వచ్చింది. దీంతో చాలా రోజులు నేను విమానం ఎక్కడానికే భయపడ్డాను. ఓసారి రాజీవ్‌కు షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తన కాలు విరిగిపోయినట్లు కల వచ్చింది.
అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ మాత్రమే ఉండేది. రాజీవ్ తలనకోనలో షూటింగ్‌లో ఉన్నాడు. ఆ రోజంతా కాంటాక్ట్‌లోకి రాకపోతే భయం వేసింది. ఆ తర్వాత ఫోన్ చేసినప్పుడు 'నువ్వు బాగానే ఉన్నావా?' అని అడిగా. ఎందుకు అలా అడుగుతున్నావ్? అని రాజీవ్ అంటే నాకు వచ్చిన కల గురించి చెప్పాను. 'షూటింగ్‌లో ప్రమాదవశాత్తు నేను డ్రైవ్ చేస్తున్న కారు చెట్టుకు ఢీకొట్టింది. కాలు విరిగింది. డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారని చెప్పారు.' దీంతో వెంటనే నేను అక్కడికి వెళ్లి వెంటనే రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించా. ఒక్కోసారి అలాంటి కలలు భయపెడతాయి.' అని అన్నారు.
ప్రెగ్నెన్సీతోనూ యాంకరింగ్
ప్రెగ్నెన్సీ టైంలోనూ తాను యాంకరింగ్ చేసినట్లు తెలిపారు సుమ. '8 నెలల ప్రెగ్నెన్సీ టైంలో ఎన్టీఆర్ అశోక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను. యూసుఫ్ గుడా స్టేడియంలో మేము బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవుదాం అనుకున్నాం. ఆ రోజు రాజీవ్ కూడా ఉన్నాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ డోర్ నుంచే వెళ్లిపోదాం అనుకున్నాం. ఈలోపు అటు నుంచి డోర్ వేసేశారు. ఆడియన్స్ మా వైపు దూసుకొచ్చేస్తున్న టైంలో రాజీవ్ నన్ను కాపాడాడు. ఆ తర్వాత డోర్ తెరుచుకోగా ఊపిరి పీల్చుకున్నా.' అంటూ అప్పటి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.





















