By: ABP Desam | Updated at : 04 Jun 2023 11:38 AM (IST)
భర్త భరద్వాజ్ తో అనసూయ(Photo Credit: Anasuya Bharadwaj/Instagram)
బుల్లితెర యాంకర్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అందాల అనసూయ. ‘జబర్దస్త్’ కామెడీ షోతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది. అదిరేటి అందం, అంతకు మంచి చలాకీ తనంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమా నటీమణులకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీని వదిలి వెండితెరపై అడుగు పెట్టింది. వరుస అవకాశాలుతో దూసుకుపోతోంది. అర డజన్ కు పైగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.
వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరికలేక గడుపుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమా విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్ వెకేషన్ లో భాగంగా బ్యాంకాక్ వెళ్లారు. బీచుల్లో ఎంజాయ్ చేయడంతో పాటు అక్కడి పట్టణాల్లో సరదాగా గడుపుతున్నారు. పొట్టి దుస్తుల్లో బ్యాంకాక్ వీధుల్లో కలియ తిరుగుతూ, షాపింగ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఇవాళ అనసూయ, భరద్వాజ్ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా బ్యాంకాక్ బీచులో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా, తన ప్రేమ, పెళ్లి, జీవిత ప్రయాణం గురించి అనసూయ ఎన్నో విషయాలను వెల్లడించింది. “మీరు నాకు రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. తేదీ జనవరి 23, 2001. న్యూ ఢిల్లీలోని ఆడిటోరియంలో జరిగిన సాంస్కృతిక పోటీకి హారైన సందర్భం. నేను ఎప్పుడూ మీకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్పేందుకు ప్రయత్నిస్తాను” అంటూ అనసూయ మొదలుపెట్టింది.
“ప్రియమైన నిక్కూ.. ఇన్నాళ్లూ నాతో కలిసి ఉండటమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు మీపై ఎంతో నీచమైన కామెంట్స్ చేశారు. కానీ, మీరు వాటిని పట్టించుకోలేదు. మన ప్రేమ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిలబెట్టావు. అందుకు నీకు కృతజ్ఞతలు. నన్ను ఎంతో ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటున్నారు. మనం ఎంతో తెలివిగా ముందుకు సాగుతున్నాం. పైకి ఎదుగుతున్నాం. మీరు నన్ను ఇంతగా ప్రేమగా, ఇంత ఒపికగా ఎలా చూసుకుంటున్నారు? అని ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాల్లో నిన్ను వెనుకేసుకున వస్తున్నాను. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. కొంత మంది మన జీవితాన్ని చికాకు పెట్టాలని భావిస్తున్నా, పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాం. మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు. కానీ, కష్టసుఖాల్లో తోడుంటూ కలిసిపోతున్నాం. మన మధ్య ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఒకరికొకరం బలంగా ముందుకుసాగుతున్నాం. మన వివాహ బంధాన్ని డేటింగ్ లాగా ఉండేందుకు అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు. హ్యాపీ యానివర్సరీ బేబ్. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. అనసూయ ‘విమానం‘ సినిమాలో సుమతి పాత్రలో నటించింది.
Read Also: మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?
Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !
‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
Akhil Akkineni : తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>