అన్వేషించండి

Amitabh Bachchan: అటు సినిమాలు... ఇటు ఎండార్స్‌మెంట్లు... మధ్యలో KBC - అమితాబ్ టోటల్ ఆస్తుల విలువెంతో తెలుసా?

వయసు 82 ఏండ్లు అయినా ఇప్పటికీ కుర్రాడిలా యాక్టివ్ గా ఉంటారు అమితాబ్ బచ్చన్. ఈ ఏజ్ లోనూ సినిమాలు, ఎండార్స్ మెంట్లతో ఫుల్ బిజీగా ఉంటారు. ఇప్పటి వరకు రూ. 3,190 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు.

Amitabh Bachchan Net Worth: బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ షాహెన్‌ షాగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబాబ్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ పాన్ ఇండియన్ మూవీ 'కల్కి 2898 AD'లో కనిపించారు. ఆశ్వత్థామ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. 82 ఏండ్ల వయసులోనూ ఆయన కష్టపడుతూ.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెడుతున్నారు. ప్రస్తుతం బిగ్ బీ రూ. 3,190 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారు. అతడి విలాసవంతమైన లైఫ్ స్టైల్, లగ్జరీ ఆస్తులు, రోల్స్ రాయిస్ ఫాంటమ్, పోర్షే కేమాన్ S, మెర్సిడెస్ మేబ్యాక్ S560 లాంటి లగ్జరీ కార్లును కలిగి ఉన్నారు. సినిమాలతో పాటు ఎండార్స్‌ మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో ఆస్తులను ఎలా పెంచుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   

కోట్ల విలువైన ఆస్తులు

అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా ముంబై స్కై స్క్రాపర్ 31వ అంతస్తులో సీ-వ్యూ అపార్ట్‌ మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబై సిటీలోని జుహులో ఉన్న తన ఐకానిక్ జల్సా మాన్షన్‌ లో నివసిస్తున్నారు. దీనిలో పలు  బెడ్‌ రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, విశాలమైన గార్డెన్ ఉన్నాయి. దీని విలువ సుమారు రూ. 112 కోట్లు. అదే ప్రాంతంలో ప్రతీక్ష, జనక్, వత్సా, జల్సా లాంటి వివాలసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వత్స అనే భవనాన్ని సిటీ బ్యాంక్ ఇండియాకు ఆయన లీజుకు ఇచ్చారు.   

సినిమాలు, ఎండార్స్ మెంట్లు

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో అమితాబ్ ఒకరు. ఒక్కో సినిమాను ఆయన రూ. 6 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటనకు గాను ఆయన రూ.10 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు, క్యాడ్‌బరీ డైరీ మిల్క్, డాబర్ చవన్‌ ప్రాష్, ఇమామి, కళ్యాణ్ జ్యువెలర్స్, గుజరాత్ టూరిజంకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో ఎండార్స్‌ మెంట్‌ కు సుమారు రూ. 5 కోట్లు తీసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్ 16లో ప్రతి ఎపిసోడ్‌ కు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ

50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ రూ. 3190 కోట్ల నికర ఆస్తులను సంపాదించారు. సినిమాలు, ఎండార్స్ మెంట్ల ద్వారానే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. అతడి నికర ఆస్తుల విలువ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 

బిగ్ బీ గ్యారేజీలో బోలెడు లగ్జరీ కార్లు

అమితాబ్ బచ్చన్ గ్యారేజ్ లో బోలెడు లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీతో పాటు  రూ.3.29 నుంచి 4.04 కోట్ల విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జిటిని కలిగి ఉన్నారు. రూ. 8.99 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నది. Lexus LX570, Audi A8L సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.  

సొంత ప్రైవేట్ జెట్

అమితాబ్ బచ్చన్ కు రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్‌ తో పాటు బిగ్ బీ దగ్గర సొంత జెట్ ఉన్నది.  

Read Also: రోలెక్స్ రేంజ్‌లో నాగార్జున రోల్ - నెట్టింట లీక్ కావడంతో లోకేష్ ఆవేదన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget