అన్వేషించండి

Lokesh Kanagaraj: రోలెక్స్ రేంజ్‌లో నాగార్జున రోల్ - నెట్టింట లీక్ కావడంతో లోకేష్ ఆవేదన

రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Lokesh Kanagaraj Responds to Coolie Fight Scene Leak: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కూలీ’. స్టార్ డైరెక్టర్ లోకేష్ కగనరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నాగార్జునతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన సైమన్ గా కనిపించబోతున్నట్లు తెలిపారు.

నాగార్జున ఫైట్ సీన్స్ లీక్

తాజాగా నాగార్జునకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. వైజాగ్ లో భారీ యాక్షన్ సీన్లను షూట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫైట్ కు సంబంధించి పలు కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయి. మూడు యాంగిల్స్ లో ఈ ఫైట్ సన్నివేశాలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు తెలియడంతో ఆయన తీవ్రంగా బాధపడ్డారు.

రెండు నెలల కష్టం వృథా- లోకేష్ కనగరాజ్

‘కూలీ’ సినిమాలోని కీలక సన్నివేశాలు లీక్ కావడంపై దర్శకుడు లోకేష్ డిసప్పాయింట్ అయ్యారు. ఎంతో మంది రెండు నెలలుగా పడిన కష్టం అంతా వృథా అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “మా టీమ్ రెండు నెలలు పాటు ఎంతో కష్టపడింది. కేవలం ఒక్క లీక్ తో ఆ కష్టం అంతా వృథా అయ్యింది. దయచేసి సినిమా సన్నివేశాల లీకులను ఎవరూ ఎంకరేజ్ చేయకండి” అంటూ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం లోకేష్ లీక్ గురించి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆయనకు చాలా మంది సినీ అభిమానులు, రజనీకాంత్ ఫ్యాన్స్ సపోర్టు చేస్తున్నారు. లీకులకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

బంగారం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘కూలీ’

రజనీకాంత్ కెరీర్ లో 171వ సినిమాగా ‘కూలీ’ తెరకెక్కుతోంది. బంగారం స్మగ్లింగ్ కథాశంతో ఈ సినిమానూ రూపొందిస్తున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శృతి హాసన్‌, సత్యరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవా పాత్ర పోషిస్తుండగా, నాగార్జున సైమన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్ లో భగంగా నాగార్జున మీద యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. ఈ విజువల్స్ ను ఎవరో రహస్యంగా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి. ఈ విషయానికి సంబంధించి చిత్రబృంద కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.  

Read Also: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget