News
News
X

PushpaRaj : పుష్పరాజ్ - ఇది అల్లు అర్జున్ సినిమా కాదు

పుష్ప... పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ గుర్తు వస్తారు. కానీ, ఇది ఆయన సినిమా కాదు!

FOLLOW US: 

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... కాదు ఫైర్! - 'పుష్ప : ది రైజ్' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ ఇది. పుష్ప పాత్రలో ఆయన పెర్ఫార్మన్స్ ఫైర్ అనే చెప్పాలి. పుష్ప... పుష్పరాజ్ అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియన్ ఆడియన్స్‌కు అల్లు అర్జున్ గుర్తుకు వస్తారు. 'పుష్ప' సినిమా, అందులో ఆయన క్యారెక్టర్ చూపించిన ప్రభావం అటువంటిది. ఈ నెలలో 'పుష్పరాజ్' పేరుతో తెలుగులో ఒక సినిమా విడుదల కానుంది. ట్విస్ట్ ఏంటంటే... ఇది అల్లు అర్జున్ సినిమా కాదు.

'పుష్పరాజ్'గా అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, 'పొగరు' సినిమాతో గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ కథానాయకుడు ధ్రువ సర్జా (Dhruva Sarja). 'పుష్పరాజ్ ది సోల్జర్' (PushpaRaj Movie) సినిమాతో ఆగస్టు 19న థియేటర్లలోకి రానున్నారు. ధ్రువ సర్జా నటించిన కన్నడ సినిమా 'భర్జరి'కి తెలుగు అనువాదం ఇది. ఆర్.ఎస్. ప్రొడక్షన్స్ అధినేత ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై నిర్మాతలు బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ తెలుగులోకి అనువదిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథానాయికలే
'పుష్పరాజ్ ది సోల్జర్' సినిమాలో ధ్రువ సర్జా సరసన డింపుల్ క్వీన్ రచితా రామ్ (Rachitha Ram), హరిప్రియ (Haripriya) కథానాయికలుగా నటించారు. తెలుగు సినిమా 'సూపర్ మచ్చి'లో కళ్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ నటించారు. తెలుగు సినిమాలు కొన్ని చేశారు హరిప్రియ. వీళ్ళిద్దరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథానాయికలే. ఇక, ఈ చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. కన్నడలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. థియేటర్లలో వంద రోజులు ఆడింది. 

Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్

పుష్పరాజ్... లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్!
'పుష్పరాజ్' లవ్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని, తెలుగు ప్రేక్షకులకు కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయని నిర్మాత బొడ్డు అశోక్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు పుష్పరాజ్ మా సినిమా టైటిల్‌గా పెట్టడంతో మంచి క్రేజ్ వచ్చింది. నిర్మాతగా ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకు వస్తుందని నమ్మకంగా ఉన్నాను. తెలుగులో యాక్షన్ కింగ్ అర్జున్ గారి చిత్రాలు ఎలాగైతే ఆదరించారో... ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఆగస్టు 19న (PushpaRaj On Aug 19th) తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తోందో చూడాలి. 

Also Read : ‘బిగ్ బాస్’ సీజన్ 6 వచ్చేస్తోంది, కొత్త లోగో వీడియో చూశారా?

Published at : 05 Aug 2022 06:09 AM (IST) Tags: PushpaRaj Movie Dhruva Sarja Rachita Ram PushpaRaj On Aug 19th

సంబంధిత కథనాలు

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా