News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

శ్రీ విష్ణు 'సామజవరగమన' పై బన్నీ ప్రశంసలు - ఇది అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్!

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన' పై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.

FOLLOW US: 
Share:

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో శ్రీ విష్ణు కూడా ఒకరు. ఇండస్ట్రీలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారారు శ్రీ విష్ణు. ముఖ్యంగా ఒకే జోనర్ సినిమాలు కాకుండా లవ్ స్టోరీస్, కామెడీ మూవీస్, తో పాటూ కథా బలం ఉన్న ఎమోషనల్ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఈ మధ్యకాలంలో 'బ్రోచేవారెవరురా', 'రాజరాజ చోరా' వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ విష్ణు తాజాగా 'సామజవరగమన' అనే సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రామ్ అబ్బవరం దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూన్ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో శ్రీ విష్ణు, సీనియర్ హీరో నరేష్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. దాంతోపాటు సినీ సెలబ్రిటీ నుంచి కూడా ఈ సినిమాకి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ, యాక్షన్ హీరో గోపీచంద్, అడవి శేష్ లాంటి హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. 'సామజవరగమన' సినిమాకి బన్నీ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ టీం కి తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు.

Congratulations to the team of #Samajavaragamana Movie . A proper telugu family entertainer after a long time . Enjoyed the movie till the end . Well written & neatly handled by the Director @RamAbbaraju @sreevishnuoffl rocked the show . Truly happy for him . Great support by…

— Allu Arjun (@alluarjun) July 5, 2023

ఈ మేరకు బన్నీ ట్వీట్స్ చేస్తూ.. "సామజవరగమన చిత్ర బృందానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఇది అసలు సిసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా చాలా బాగా ఎంజాయ్ చేశాను. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. సినిమాలో శ్రీ విష్ణు రాకింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.  అతని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వెన్నెల కిషోర్, నరేష్ తమ పాత్రలతో సినిమాకు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. నా మలయాళీ  అంటూ హీరోయిన్ రెబ్బ మౌనికని ప్రత్యేకంగా అభినందించారు బన్నీ. ఇది 100% తెలుగు ఎంటర్టైనర్ మూవీ" అంటూ బన్నీ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ప్రస్తుతం బన్నీ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో 'సామజవరగమన' సినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించడం ఒక విధంగా మూవీ టీం కి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Also Read : ‘డెవిల్’ మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Jul 2023 03:22 PM (IST) Tags: Allu Arjun Bunny Sri Vishnu Samajavaragamana Movie Sri Vishnu Samajavaragamana Movie

ఇవి కూడా చూడండి

Manchu Vishnu: ‘కన్నప్ప’ విషయంలో వారికి థ్యాంక్స్! మనోజ్ పేరు ఎక్కడా ప్రస్తావించని మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ విషయంలో వారికి థ్యాంక్స్! మనోజ్ పేరు ఎక్కడా ప్రస్తావించని మంచు విష్ణు

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత