Allu Arjun AAA Cinemas: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ‘AAA సినిమాస్’లోని ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ నెల 16న ఆయన ‘AAA సినిమాస్’ ప్రారంభం కానుంది. ‘ఆదిపురుష్’ సినిమాతో అట్టహాసంగా ఓపెన్ అవుతోంది.
హైదరాబాద్ అమీర్ పేటలో ఒకప్పుడు సత్యం థియేటర్ బాగా ఫేమస్. ఇంకా చెప్పాలంటే అప్పట్లో హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికీ ఈ థియేటర్ సుపరిచితం. రాను రాను ఈ థియేటర్ తన వైభవాన్ని కోల్పోయింది. కొంత కాలం క్రితం దాన్ని కూల్చేశారు. సత్యం థియేటర్ ప్లేస్ లో ఇప్పుడు మాల్ తో పాటు మల్టీ ఫ్లెక్స్ గా మారిపోయింది. ఆసియన్ మాల్ గా మారిన ఈ థియేటర్ టాప్ ఫ్లోర్ లో హీరో అల్లు అర్జున్ ‘AAA సినిమాస్’ మల్టీ ఫ్లెక్స్ నిర్మించారు. ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ ఈ నెల 16 నుంచి జనాలకు అందుబాటులోకి రాబోతోంది.
మళ్లీ సత్యం థియేటర్ నాటి రోజులు వచ్చేనా?
ఇవాళ్టి నుంచే అక్కడ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. 15న అల్లు అర్జున్ మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభిస్తారు. 16న థియేటర్లలో ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శనతో ఈ మల్టీ ఫ్లెక్స్ షురూ అవుతుంది. బన్నీ థియేటర్లో ప్రభాస్ సినిమా అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సత్యం థియేటర్ సిటీలో కీలక ప్రాంతంలో ఉంది. ఎక్కువ జనసందోహంగా ఉంటుంది. సినిమా అభిమానులు కూడా ఈ ప్రదేశంలో ఎక్కువగా ఉంటారు. సత్యం థియేటర్ కూల్చివేయడంతో అక్కడికి వెళ్లే వాళ్లంతా పంజాగుట్ట పివిఆర్ వైపు వెళ్తున్నారు. మళ్లీ సత్యం థియేటర్ ప్లేస్ లో బన్నీ థియేటర్ ప్రారంభమైతే, పంజాగుట్టకు వెళ్లే ప్రేక్షకులకు ఇది కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో 5 స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు.
అత్యద్భుతమైన సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత
ఇక AAA సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతోంది. ఇందులో సినిమా చూస్తే అసాధారణమైన అనుభూతి పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. సినిమా అనేది ప్రేక్షకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగించేలా AAA సినిమాస్ అత్యద్భుతమైన సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతతో అత్యుత్తమ వినోదం అందించబోతోంది. చలనచిత్ర అభిమానులకు స్వర్గధామం కాబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్, డిజైన్ తో పాటు AAA సినిమాస్ ఇంటీరియర్స్ అత్యద్భుతంగా, అత్యాధునికతను కలిగి ఉంటుంది. మల్టీప్లెక్స్ లో బ్లాక్-థీమ్ డెకర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఇప్పటివరకు కూర్చుని చూసే థియేటర్లే ఉండగా, ఇందులో పడుకుని సినిమా చూసే అవకాశం ఉంది. అత్యంత విలాసవతంగా సినిమా అనుభూతిని పొందవచ్చు అంటున్నారు. కళ్లు జిగేలుమనే లైట్ల కాంతులతో థియేటర్ అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. AAA సినిమాస్‌లో ఐదు స్క్రీన్‌లు ఉన్నాయి. మొదటి దాంట్లో కాస్త ఎక్కువ ధర ఉంటుంది. ధరకు తగినట్లుగానే సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతతో సినిమా చూసే అవకాశం ఉంటుంది. వాటిలో బిగ్ ఫార్మాట్ EpiQ స్క్రీన్ ఉంటుంది. ఇది వీక్షకులను చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అద్భుతమైన విజువల్స్, లీనమయ్యే సౌండ్ సిస్టమ్‌తో పెద్ద స్క్రీన్‌పై ప్రతి మూమ్ మెంట్ ను అద్భుతంగా తిలకించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కొత్త బిజినెస్ లోకి అడుగు పెడుతున్న బన్నీకి మంచి ఆదరణ దక్కాలని సినీ లవర్స్ తో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: వామ్మో! ఒక్క టికెట్ ధర రూ.2 వేలా? హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘ఆదిపురుష్’ టిక్కెట్లు