Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్.. భార్యకు ధైర్యం చెప్పిన బన్నీ.. బట్టలు కూడా మార్చుకోనివ్వలేదంటూ ఆవేదన
Allu Arjun Arrested : అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే వెళ్తూ వెళ్తూ అల్లు అర్జున్ ఏమి మాట్లాడడంటే..
Allu Arjun Arrested over Pushpa 2 Premire Stampede Issue : అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్ సమయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్‌కి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు బన్నీని చూసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోయిన క్రమంలో తొక్కిసలాట జరిగి.. ఓ మహిళ మృతి చెందింది. రేవతి మృతితో పాటు.. ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏమి కాదు.. భార్యకు ధైర్యమిచ్చి
ఈ కేసు నేపథ్యంలోనే పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసేందుకు ఆయన స్వగృహానికి వెళ్లారు. అక్కడి అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా.. బన్నీ తన వైఫ్‌తో మాట్లాడారు. ''డల్ అయిపోయావేంటి.. ఏమి కాదు. ఏమి కాదు''.. అంటూ భార్యను ఓదార్చాడు బన్నీ. అనంతరం ''రెడ్డి గారు నా కాఫీ అయిపోనివ్వండి. వచ్చేస్తాను'' అంటూ చెప్పారు.
మీ తీరు నాకు నచ్చలేదు సార్
పోలీసులతీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. ''సార్ మీకు ఏమి హానర్ చేయను. ఎందుకంటే మీరు కనీసం నన్ను బట్టలు మార్చుకోనివ్వండి అంటే పర్మిషన్ ఇవ్వలేదు. నన్ను తీసుకెళ్లడం తప్పు లేదు. ఇది చేయడం తప్పు లేదు. కాదనను. కానీ కనీసం పర్మిషన్ ఇవ్వకుండా బెడ్ రూమ్ దగ్గరికి వచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోతాను, పారిపోతాను అన్నట్లు బిహేవ్ చేసింది నాకు నచ్చలేదు. ఇది మంచి విషయం కాదు'' అని అల్లు అర్జున్ వీడియోలో మాట్లాడారు.
డాడీ నువ్వెందుకు
కాఫీ తాగిన తర్వాత పోలీస్ జీప్ ఎక్కేందుకు వెళ్లి.. అక్కడ అల్లు అరవింద్‌ని చూసి.. ''డాడీ నువ్వెందుకు డాడీ. నువ్వు వెళ్లిపో. దీనిలో ఏ క్రెడిట్ వచ్చినా.. నాకే ఉండాలి. గుడ్ అయినా.. బ్యాడ్ అయినా'' అంటూ చెప్పాడు. నవ్వుతూనే కేస్‌ని ఫేస్ చేసేందుకు వెళ్తున్నట్లు బన్నీ తెలిపాడు.
ముందే కోర్టుకెళ్లినా..
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అల్లు అర్జున్ డిసెంబర్ 11వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. కానీ పోలీసులు డిసెంబర్ 13వ తేదీన బన్నీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆయనను అరెస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నాన్ బెయిల్ కేస్
భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 118 (1), 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టం. ఈ సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 118 (1) సెక్షన్ ప్రకారం కూడా నేరం రుజువు అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చట్టం చెబుతోంది.
Also Read : హీరో అల్లు అర్జున్ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు