అన్వేషించండి

Actor Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్‌ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు

Pushpa 2 Hero Allu Arjun Arrest: హీరో అల్లు అర్జున్‌ను ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.ఉదయం ఆయన ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అరెస్టు విషయాన్ని తెలియజేశారు.

Pushpa 2 Hero Allu Arjun Arrest: సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒకరు ప్రాణం పోయింది.  ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్ లో కేసు నమోదైంది.. ఈ రోజు బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు..

సంధ్య థియేటర్లో  పుష్ప-2 సినిమా  ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌  సంధ్య థియేటర్‌ వద్ద  జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది.   ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్‌  డిసెంబరు 11 బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. తన రాక కారణంగా తొక్కిసలాటలో భార్య రేవతి మృతి చెందడం. కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంపై  ఎం.భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అన్నారు. సినిమా విడుదల సందర్భంగా తాను థియేటర్‌కు రావడం సహజం అని గతంలోనూ చాలాసార్లు హాజరయ్యాను కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు. తాను థియేటర్ దగ్గరకు వస్తున్నట్టు థియేటర్‌ నిర్వాహకులకు, ఏసీపీకి సమాచారం ఇచ్చానన్నారు బన్నీ. ఇందులో నిర్లక్ష్యం లేదని ఫిర్యాదుదారు ఆరోపణలు అవాస్తవం అన్నారు.  కేవలం తన రాక వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొనడం సమంజసం కాదన్నారు.ఈ కారణంగా తనపై కేసు నమోదు చేయడం అంటే న్యాయప్రక్రియను దుర్వినియోగపరచడమేనని బన్నీ అభిప్రాయపడ్డారు. ఈ కేసు వల్ల తన పేరు ప్రతిష్ఠలకు, గౌరవానికి భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తనపై నమోదైన కేసుును కొట్టేయాలని ... అరెస్ట్ సహా విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.  

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ కు ముందురోజైన డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో ప్రదర్శించారు.ఆ థియేటర్లో అభిమానులతో కలసి సినిమా చూసేందుకు వెళ్లారు అల్లు అర్జున్. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సాయితేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.  

డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప2’ అత్యంత వేగంగా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఆరు రోజుల్లో వెయ్యికోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 ప్రభంజనం నడుస్తున్న ఈ టైమ్ లోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ట్రెండ్ అయ్యాయ్. ఈ మేరకు స్పందించిన టీమ్ అల్లు అర్జున్...ఇవన్నీ అసత్య ప్రచారాలే అని..ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఏమైనా కానీ ఆయన టీమ్ మాత్రమే విడుదల చేస్తుందని క్లారిటీ ఇచ్చారు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Quinton de Kock 97 vs RR IPL 2025 | ఐపీఎల్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డికాక్ | ABP Desam#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Salman Khan: 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
Venky Atluri : పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Embed widget