Deepika Padukone: బేబీ బంప్‌పై ట్రోల్స్ - దీపికాకు ఆలియా సపోర్ట్
Alia Bhatt - Deepika Padukone: దీపికా పదుకొనే బేబీ బంప్ పై వస్తున్న ట్రోల్స్ కి గట్టి సమాధానం చెప్తున్నారు చాలామంది సెలబ్రిటీలు. ఆలియా భట్ కూడా దీపికా పదుకొనేకు సపోర్ట్ గా నిలిచారు.
Deepika Padukone baby bump: సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అయిన దానికి కాని దానికి కామెంట్లు పెడుతూ మరీ నీచంగా మాట్లాడుతున్నారు. ఇక సెలబ్రిటీలు ఏమి చేసినా దాన్ని ట్రోల్ చేయడం, వాళ్లపై కామెంట్లు పెట్టడం షరా మాములే. అలా త్వరలో తల్లి కాబోతున్న బాలీవుడ్ హిరోయిన్ దీపికా పదుకునే ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె బేబి బంప్ నిజం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. అయితే, అలా కామెంట్ చేసేవాళ్లకి బుద్ధి చెప్తున్నారు మిగతావాళ్లు. దిపికాకు సపోర్ట్ గా నిలబడుతున్నారు.
బేబి బంప్ ఫేక్ అంటూ..
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనె ఈ ఏడాదిలో అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాము బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రటించింది ఈ జంట. అయితే, ఇటీవల ఓటు వేసేందుకు బయటికి వచ్చిన దీపిక మీడియా కంట్లో పడింది. దీంతో అందరూ ఫొటోలు క్లిక్ మనిపించారు. ఆ ఫొటోల్లో దీపికా వైట్ షర్ట్, ప్యాంట్ వేసుకుని ఉండగా.. ఆమె బేబీ బంప్ కనిపిస్తోంది. దీంతో అభిమానులు తెగ ఖుషి అయ్యారు. అయితే కొంతమంది మాత్రం ఆ బేబి బంప్ ఫేక్ అని, దీపికా అసలు ప్రెగ్నెంట్ కాదని కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఆమెను ట్రోల్స్ చేశారు.
ఆలియా సపోర్ట్..
సోషల్ మీడియాలో దీపికపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తిప్పికొట్టారు చాలామంది సెలబ్రిటీలు. దిపికాకు అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, పూజా భట్, ఆహానా కుమారా తదితరులు దీపికాకు మద్దతు ప్రకటించారు. ఫేమస్, సీనియర్ జర్నలిస్ట్.. ఫయేద్ సౌజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా దాన్ని సమర్థిస్తున్నారు అందరూ. “డియర్ సోషల్ మీడియా, దీపికా తన డెమోక్రటిక్ డ్యూటీని తీర్చుకునేందుకు బయటికి వచ్చింది. ఓటు వేసేందుకు వచ్చింది. అంతేకానీ ఆమె బాడీ మీద, ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఫీడ్ బ్యాక్ ఇవ్వమని అగడలేదు. ఆమె జీవితం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇంకా ఆపండి” అంటూ పోస్ట్ పెట్టగా.. ఆలియా భట్.. ఆ పోస్ట్ ని లైక్ చేసింది. పూజా భట్, షాహీన్ భట్ తదితరులు కూడా ఆ పోస్ట్‌ను లైక్ చేసి సపోర్ట్ ప్రకటించారు.
థ్యాంక్స్ చెప్తున్న దీపికా ఫ్యాన్స్..
దీపికా పదుకునేకి సపోర్ట్ ఇస్తున్నందుకు ఆమె ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నారు. ఆలియా కూడా ఇలాంటివి ఫేస్ చేసిందని, ఇప్పుడు దిపికాకు సపోర్ట్ ఇవ్వడం ఆనందంగా ఉందని, ఫేస్ చేసిన వాళ్లకి ఆ బాధ తెలుస్తుందని రాసుకొచ్చారు ఒక ఫ్యాన్. “ఈటైంలో కచ్చితంగా సపోర్ట్ అవసరం. అది ఆమె పర్సనల్. ఎవరో ఇచ్చే ఒపీనియన్స్ ఆమెను బాధపెట్టకూడదు. తల్లి, బిడ్డ, తండ్రి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం” అని ఇంకో ఫ్యాన్ రాసుకొచ్చారు. అలా తమ అభిమాన నటికి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ గా నిలబడి ధైర్యం చెప్తున్నారు ఆమె ఫ్యాన్స్.
Also Read: ఆ అమ్మాయిల కోసమే ఇంక పెళ్లి చేసుకోలేదు.. తన పోస్ట్ వెనుక ఉన్నదెవరో చెప్పిన ప్రభాస్