అన్వేషించండి

Prabhas Kalki 2898 AD: ఆ అమ్మాయిల కోసమే ఇంక పెళ్లి చేసుకోలేదు.. త‌న పోస్ట్ వెనుక ఉన్నదెవ‌రో చెప్పిన ప్ర‌భాస్

Kalki 2898 AD: టాలీవుడ్ లో పెళ్లి ప్ర‌స్తావ‌న‌ వ‌చ్చిందంటే చాలు అంద‌రూ ప్ర‌భాస్ గురించి మాట్లాడ‌తారు. ఆయ‌న పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు ప్ర‌భాస్.

Prabhas About his Marriage In Kalki 2898 AD Event: టాలీవుడ్ లో ఏ హీరోదైనా పెళ్లి అంటే చాలు.. వెంట‌నే ప్ర‌భాస్ పెళ్లి గురించి చ‌ర్చ మొద‌ల‌వుతుంది. టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌ల‌ర్స్ లో ఆయ‌న ఒక‌రు. అయితే, ఈ మ‌ధ్యే ప్ర‌భాస్ ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. "నా జీవితంలోకి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారు" అని. దీంతో అంద‌రూ ఆయ‌న పెళ్లి అంటూ కామెంట్లు పెట్టారు. ఫ్యాన్స్ అయితే.. ఏ హీరోయిన్ అలాంటి పోస్ట్ పెట్టినా? వాళ్ల వ‌దిన ఆమె ఏమో అని ఫీల్ అయిపోయారు. అయితే, ఆ పోస్ట్ ఎందుకు పెట్టారో? పోస్ట్ ఎవ‌రు పెట్టించారో? అస‌లు త‌ను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో క్లారిటీ ఇచ్చాడు ప్ర‌భాస్. 'క‌ల్కీ' ఈవెంట్ లో ఆయ‌న ఈ విషయం గురించి మాట్లాడారు. ఇక త‌న బుజ్జి గురించి కూడా చెప్పారు ప్రభాస్ ఆయ‌న ఏమ‌న్నారంటే? 

నేనూ వెయిట్ చేస్తున్నాను.. 

'క‌ల్కీ' ఈవెంట్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటిలో గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఎంత‌లా అంటే గ‌తంలో ఏ సినిమా ఈవెంట్ ఇంత‌లా జ‌ర‌గ‌లేదు. ఇక ఆ ఈవెంట్ కి ప్ర‌భాస్ ఇచ్చిన ఎంట్రీ అయితే వేరె లెవెల్ అనే చెప్పాలి. అయితే, స్టార్ యాంక‌ర్ సుమ ఈవెంట్ కి యాంక‌రింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌భాస్ ని బుజ్జి గురించి అడ‌గ‌గా.. ఆయ‌న ఇలా చెప్పుకొచ్చారు. "బుజ్జిని క‌లిశాను.. మూడేళ్లు మా బ‌క్క డైరెక్ట‌ర్ న‌న్ను టార్చ‌ర్ పెట్టాడు. ఆ బుజ్జి తోనే ఉంచారు. ఫైన‌ల్లీ బుజ్జితో మ‌న డార్లింగ్స్ కి హాయ్ చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాను కానీ, ఏంటి సార్ ఈ కార్లు, ఈ ఫీట్లు?. ఇక బుజ్జి కోసం నేను కూడా సూప‌ర్ య‌గ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. టీజ‌ర్లు, సినిమాలు ఎప్పుడు వ‌స్తాయా? అని ఈగ‌ర్ గా ఉంది" అంటూ బుజ్జి గురించి చెప్పాడు ప్ర‌భాస్. 

ఆ అమ్మాయిల కోస‌మే పెళ్లి చేసుకోలేదు... 

పెళ్లి గురించి ప్ర‌భాస్ త‌న మ‌నసులో మాట బ‌య‌టపెట్టారు. "మొన్న మీరు పెట్టిన పోస్ట్ ఎంతోమంది అమ్మాయిల గుండెల‌ను ప‌గిలేలా చేసింది తెలుసా?" అని సుమ అడ‌గ‌గా.. "ఆ అమ్మాయిల కోసం పెళ్లి చేసుకోలేదు" అంటూ న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు ప్ర‌భాస్. అలా పోస్ట్ పెట్టంది బుజ్జి గురించే అని హింట్ ఇచ్చారు. అవ‌న్నీ త‌న డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెలివి తేట‌లు అని చెప్పారు ప్ర‌భాస్. త‌న డైరెక్ట‌ర్ త‌న‌కు బుజ్జిని త‌గిలించాడ‌ని, బుజ్జి త‌ప్ప త‌న‌కు ఎవ్వ‌రూ లేర‌ని అన్నారు. అయితే, బుజ్జితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బుజ్జి బ్రెయిన్ చిన్న‌దే అయినా తన బుర్ర మొత్తం తినేసింద‌ని, బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెట‌ర్ అని చెప్పుకొచ్చారు ప్ర‌భాస్. నిజానికి ప్ర‌భాస్ ఏ ఈవెంట్ లో పెద్ద‌గా మాట్లాడ‌రు. హాయ్ డార్లింగ్స్ జాగ్రత్త‌, జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లండి లాంటివి మాత్ర‌మే చెప్పి ముగ్గించేస్తారు. కానీ, ఈ ఈవెంట్ లో ఆయ‌న స్పీచ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న సినిమా 'కల్కి 2898 ఏడి'. ప్ర‌పంచవ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంట్లో భాగంగా గ్రాండ్ ఈవెంట్ నిర్వ‌హించారు మేక‌ర్స్. ఈ సినిమాకి అశ్విన్ ద‌త్ ప్రొడ్యూస‌ర్ కాగా.. సినిమాలో ఎంతోమంది కీల‌క న‌టులు ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దిపికా ప‌దుకునే త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ సంద‌ర్భంగా ‘కల్కి’ చిత్రంలో కీలకంగా ఉన్న బుజ్జి టీజర్‌‌ను లాంఛ్ చేశారు. 50 సెకన్ల నిడివితో ఉన్న బుజ్జి టీజర్  లాంచ్ చేశారు. అది అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Also Read: గాయమైనా సరే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌కు ఐశ్వర్య రాయ్ ఎందుకెళ్లినట్లు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Internal Politics :  బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
AP Volunteers: వాలంటీర్లకు కొత్త మార్గదర్శకాలివే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
వాలంటీర్లకు కొత్త మార్గదర్శకాలివే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
Hyderabad Rains: వర్షాకాలం సీజన్ ప్రారంభం, జంట నగరాల్లో పటిష్టమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
వర్షాకాలం సీజన్ ప్రారంభం, జంట నగరాల్లో పటిష్టమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Chandrababu Polavaram Visit: సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే
సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Chiranjeevi Wife Surekha Gift to Pawan kalyan | పవన్ కు ఇచ్చిన పెన్ను ధర లక్షల్లో ఉంటుందా..? | ABPTTD New EO Shyamala Rao | Shock to Dharmareddy |ధర్మారెడ్డికి షాకిచ్చిన చంద్రబాబుCM Chandrababu Naidu Key Decisions | వైసీపీ అనుకూల అధికారులకు బాబు ఝలక్..!KCR Letter to Justice L Narasimha Reddy Commission | 12 పేజీల లేఖతో వివరణ ఇచ్చిన కేసీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Internal Politics :  బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్ లేదా ప్రవీణ్ - కేసీఆర్ కీలక నిర్ణయం తీసేసుకున్నారా ?
AP Volunteers: వాలంటీర్లకు కొత్త మార్గదర్శకాలివే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
వాలంటీర్లకు కొత్త మార్గదర్శకాలివే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
Hyderabad Rains: వర్షాకాలం సీజన్ ప్రారంభం, జంట నగరాల్లో పటిష్టమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
వర్షాకాలం సీజన్ ప్రారంభం, జంట నగరాల్లో పటిష్టమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Chandrababu Polavaram Visit: సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే
సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే
Ram Charan-Upasana: కూతురు క్లింకారతో చరణ్‌, ఉపాసన - క్యూట్‌ ఫోటో వైరల్‌... స్పెషల్‌ ఏంటో తెలుసా?
కూతురు క్లింకారతో చరణ్‌, ఉపాసన - క్యూట్‌ ఫోటో వైరల్‌... స్పెషల్‌ ఏంటో తెలుసా?
Sahitya Akademi 2024 Yuva Puraskar: సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల పురస్కారాల విజేతలు వీరే - తెలుగు వారికి 2 అవార్డులు
సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల పురస్కారాల విజేతలు వీరే - తెలుగు వారికి 2 అవార్డులు
Elon Musk X Content Policy: 18+ ఉంటే తప్పేంటి అన్నారు - ఇప్పుడు మొత్తం ఎత్తిపోయేదాకా తెచ్చుకున్నారు!
18+ ఉంటే తప్పేంటి అన్నారు - ఇప్పుడు మొత్తం ఎత్తిపోయేదాకా తెచ్చుకున్నారు!
IND vs CAN: భారత్‌-కెనడా మ్యాచ్‌ రద్దు, సూపర్‌ 8లో భారత్‌ తొలి పోరు ఎవరితో అంటే?
భారత్‌-కెనడా మ్యాచ్‌ రద్దు, సూపర్‌ 8లో భారత్‌ తొలి పోరు ఎవరితో అంటే?
Embed widget