Alia Bhatt on Instagram: 'ఆర్ఆర్ఆర్' పోస్టులు ఎందుకు డిలీట్ చేశానంటే? - ఆలియా భట్ వివరణ
Alia Bhatt - RRR Deleted Posts: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబందించిన పోస్టులు డిలీట్ చేసినట్టు ఆలియా భట్ చెప్పారు. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో ఆమె వివరించారు.
'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంపై బాలీవుడ్ భామ ఆలియా భట్ ఆగ్రహంతో ఉన్నారా? దర్శక ధీరుడు రాజమౌళి ప్రవర్తనతో అప్‌సెట్ అయ్యారా? సినిమాలో తన పాత్ర నిడివి తగ్గించడంతో పాటు ప్రాముఖ్యం ఇవ్వలేదని ఫీలయ్యారా? అందుకే, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులు డిలీట్ చేశారా? రెండు మూడు రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. దీనికి ఆలియా భట్ ఫుల్ స్టాప్ పెట్టారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకు ముందు ఆలియా భట్ పోస్టులు చేసిన మాట వాస్తవమే. అయితే... ఇప్పుడు ఆ పోస్టులు ఆమె అకౌంట్ లో లేని మాట కూడా వాస్తవమే. మరి, ఏమయ్యాయి? డిలీట్ చేశారా? లేదా? అంటే... దీని వెనుక 'ఆర్ఆర్ఆర్' టీమ్ మీద ఆలియాకు కోపం ఏమీ లేదని ఆమె లేటెస్ట్ ఇన్‌స్టా స్టోరీ చూస్తే తెలుస్తుంది.
"ఆర్ఆర్ఆర్' టీమ్‌తో అప్‌సెట్ కావడంతో... ఆ సినిమాకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేశాననే వార్త ఈ రోజు నా దృష్టికి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ గ్రిడ్ ఆధారంగా ఒక నిర్ణయానికి రావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్‌స్టా గ్రిడ్ కంగాళీగా ఉండకుండా ఉండటం కోసం పాత వీడియో పోస్టుల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉంటాను" అని ఆలియా భట్ పేర్కొన్నారు. పుకార్లకు తెలివిగా సమాధానం ఇచ్చారు తప్ప... తాను పోస్టులు డిలీట్ చేసినట్టు ఎక్కడా చెప్పలేదు.
'ఆర్ఆర్ఆర్' ప్రపంచంలో తానొక భాగం అయినందుకు కృతజ్ఞరాలిగా ఉంటానని ఆలియా భట్ తెలిపారు. "సీత పాత్రలో నటించడం నాకెంతో నచ్చింది. రాజమౌళి సార్ దర్శకత్వంలో నటించడం... తారక్ (ఎన్టీఆర్), రామ్ చరణ్ తో కలిసి పని చేయడం... 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించి ప్రతి చిన్న విషయం నాకు ఎంతో నచ్చింది" అని ఆలియా భట్ పేర్కొన్నారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్'పై అలియాభట్ పోస్ట్, రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?
'ఆర్ఆర్ఆర్'కు ప్రాణం పోయడానికి రాజమౌళి గారు, ఇతర చిత్ర బృందం కొన్నేళ్లు కష్టపడ్డారని... ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అవాస్తవాలు ప్రచారం కాకూడదని తాను ఈ వివరణ ఇస్తున్నట్టు ఆలియా భట్ చెప్పుకొచ్చారు. ఈ వివాదం పక్కన పెడితే... 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.
Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!