అన్వేషించండి

Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'పై అలియాభట్ పోస్ట్, రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?

అలియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్స్ గురించి పోస్ట్ పెట్టింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె సీత అనే క్యారెక్టర్ లో కనిపించింది. అయితే ఆమె రోల్ కి స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది. 

మరో హీరోయిన్ ఒలీవియా మోరిస్ తో పోలిస్తే అలియా రోల్ చాలా చిన్నదనే చెప్పాలి. ఎండ్ టైటిల్స్ లో వచ్చే సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆడిపాడింది. తన రోల్ కి సంబంధించి అలియా చాలా ఫీల్ అవుతుందని టాక్. రివ్యూలలో కూడా హీరోయిన్ కి తక్కువ, గెస్ట్ రోల్ కి ఎక్కువ అన్నట్లుగా అలియా రోల్ ఉందని రాసుకొచ్చారు. దీంతో అలియా.. దర్శకుడు రాజమౌళిపై కోపంగా ఉందని.. తనలాంటి ఆర్టిస్ట్ ని కేవలం రెండు, మూడు సన్నివేశాలకు పరిమితం చేశారని బాధపడుతుందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. 

అంతేకాదు.. అలియా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చేసిందని.. అలానే రాజమౌళిని కూడా అన్ ఫాలో చేసిందని.. ఇలా ఒకటా రెండా? రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్స్ గురించి పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ లో 'ఆర్ఆర్ఆర్' వంద కోట్లు వసూలు చేసిందంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అలియా. ఈ ఒక్క పోస్ట్ తో తనపై వస్తోన్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. 

ఇకనైనా.. అలియాపై ఈ రూమర్లు రావడం తగ్గుతాయేమో చూడాలి. నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పటి నుంచి అలియాభట్ చాలా బిజీగా ఉంది. రెండు రోజుల క్రితం వరకు ఆమె 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కోసం వారణాసిలోనే ఉంది. దీంతో ఆమెకి 'ఆర్ఆర్ఆర్' సినిమాపై రియాక్ట్ అవ్వడానికి సరైన సమయం దొరకలేదు. ఇప్పుడు సినిమా గురించి ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి!

 


Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'పై అలియాభట్ పోస్ట్, రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
Karthika Deepam 2 Serial Today June 27th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
Nindu Manasulu Serial Today June 27th: నిండు మనసులు: గణని కాపాడమని తండ్రి కాళ్లు పట్టుకున్న సాహితి! సిద్ధూ, విజయానంద్ ఏం చేయనున్నారు?
నిండు మనసులు: గణని కాపాడమని తండ్రి కాళ్లు పట్టుకున్న సాహితి! సిద్ధూ, విజయానంద్ ఏం చేయనున్నారు?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!
వర్షాకాలంలో బైక్ రైడింగ్ చిట్కాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సేఫ్!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
Embed widget