అన్వేషించండి

OMG 2: టీనేజర్లకు చూపించాల్సిన అడల్ట్ చిత్రం ఇది: ‘ఓఎమ్‌జీ 2’కు ఏ సర్టిఫికెట్‌పై అక్షయ్ కౌంటర్

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించిన ‘ఓఎమ్‌జీ 2’ థియేటర్లలో విడుదల అవ్వకముందే, ప్రేక్షకుల ముందుకు రాకముందే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

కొన్ని సినిమాలు మేకర్స్ మైండ్‌లో ఉన్నవిధంగా ఆడియన్స్‌కు రీచ్ అవ్వలేకపోతాయి. ఒకవేళ అయినా కూడా మధ్యలోని పలు అవాంతరాల కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎమ్‌జీ 2’ విషయంలో కూడా అదే జరుగుతోంది. దేవుడి గురించి, దేవుడిపై మనుషులు చూపించే నమ్మకం గురించి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందు పెట్టాలనుకుంది ‘ఓఎమ్‌జీ 2’ టీమ్.. కానీ అనూహ్యంగా ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిపై ప్రేక్షకుల్లో ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇప్పటివరకు సీబీఎఫ్‌సీ నిర్ణయం గురించి స్పందించడానికి ఇష్టపడని అక్షయ్ కుమార్.. తాజాగా వారు ఇచ్చిన A సర్టిఫికెట్‌పై ఫైర్ అయ్యారు.

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించిన ‘ఓఎమ్‌జీ 2’ థియేటర్లలో విడుదల అవ్వకముందే, ప్రేక్షకుల ముందుకు రాకముందే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. సీబీఎఫ్‌సీ.. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వడమే దీనికి కారణం. అంతే కాకుండా ఇప్పటివరకు A సినిమాకు లేని విధంగా ‘ఓఎమ్‌జీ 2’కు 27 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించాడు.. కానీ సినిమా మాత్రం ఎక్కువగా సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమాకు యూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అంటూ A సర్టిఫికెట్‌ను అందించింది సీబీఎఫ్‌సీ. అప్పటినుండి అసలు ఈ మూవీకి A సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది అంటూ ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. ఇది ఒక విధంగా మూవీకి హైప్‌ను కూడా తీసుకొచ్చింది.

సీబీఎఫ్‌సీకి అక్షయ్ కౌంటర్..
ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓఎమ్‌జీ 2’ ప్రస్తుతం కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఇక ఈ సమయంలో సినిమాకు వచ్చిన A సర్టిఫికెట్ గురించి స్పందించాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. తాజాగా ఒక థియేటర్‌కు సర్‌ప్రైజ్ విజిట్‌కు వెళ్లారు అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి. ఆ సమయంలో ఇన్‌డైరెక్ట్‌గా సీబీఎఫ్‌సీపై పలు కామెంట్స్ చేశాడు అక్షయ్. ‘ఇది టీనేజర్ల కోసం తెరకెక్కించిన మొదటి అడల్ట్ సినిమా అయ్యిండొచ్చు. అసలైతే ఇది ప్రతీ స్కూల్‌లో చూపించాల్సిన సినిమా.’ అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి చూస్తే ‘ఓఎమ్‌జీ 2’కు A సర్టిఫికెట్ అందుకోవడం అనేది అక్షయ్‌ను ఎంతగా ఆగ్రహానికి గురిచేసిందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ స్పందించిన ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

‘ఓఎమ్‌జీ 2’ వర్సెస్ ‘గదర్ 2’..
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో పాటు యామీ గౌతమ్ కూడా ‘ఓఎమ్‌జీ 2’లో కీలక పాత్ర పోషించింది. సీబీఎఫ్‌సీ నుండి ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా మూవీ విడుదలయిన రెండురోజులకే రూ.25.56 కోట్ల కలెక్షన్‌ను సాధించింది. ఇక ఈ మూవీతో పాటు ఆగస్ట్ 11న విడుదలయిన మరో చిత్రం సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘గదర్ 2’. ‘ఓఎమ్‌జీ 2’కు మాత్రమే కాదు.. ‘గదర్ 2’కు కూడా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణే లభిస్తోంది. ‘ఓఎమ్‌జీ 2’లాగా ‘గదర్ 2’కు పెద్దగా ప్రమోషన్స్ Aమీ జరగలేదు. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ రెండూ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి.

Also Read: షారుఖ్ ‘జవాన్’ టీమ్‌కు ఊహించని షాక్, రిలీజ్‌కు ముందే ట్విట్టర్‌లో సినిమా లీక్ - అదేలా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘Aబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget