అన్వేషించండి

Naga Chaitanya - Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం నేడే - అక్కినేని ఫ్యామిలీ అఫీషియల్‌గా చెబుతుందా?

Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగచైత‌న్య‌, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం నేడు జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైత‌న్య‌, హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స‌మంత రూత్ ప్రభుతో విడాకులు తీసుకున్న చైతూ ఆ తర్వాత శోభితాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నారని, ఎంగేజ్మెంట్ కు డేట్ కూడా ఫిక్స్ అయిందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 

ఆగస్టు 8న... అంటే ఈ రోజే ఎంగేజ్మెంట్!

నాగ చైతన్య - శోభితా ధూళిపాళ ఈ రోజు (ఆగస్టు 8న) గురువారం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో అక్కినేని సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగనుందని అంటున్నారు. అక్కినేని నాగార్జున నుంచి ఎప్పుడైనా దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చని, రేపో ఎల్లుండో ఈ ఎంగేజ్మెంట్ ఫొటోలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. 

చైతన్య ఇంతక ముందు సమంతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్లు డేటింగ్ చేసిన 'ఏమాయ చేసావే' జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు తిరక్కుండానే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. కారణాలు తెలియదు కానీ, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు చై-సామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అప్పటి నుంచి ఇద్దరూ కెరీర్ మీద ఫోకస్ పెట్టి, వేర్వేరు మార్గాల్లో ప్రయాణం సాగిస్తున్నారు. 

సమంతతో విడిపోయిన తర్వాత చైతూ వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ వచ్చాయి. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేశాడని, ఇద్దరూ తరచుగా కలుస్తుంటారని బాలీవుడ్ మీడియా కోడైకూసింది. ఇవి నిజమే అంటూ ఎడిట్ చేసిన కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ ఈ రూమర్స్ పై అటు నాగ చైతన్య కానీ ఇటు శోభిత కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. మరి ఇప్పుడైనా దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'బంగార్రాజు'తో హిట్టు కొట్టిన నాగ చైతన్య.. 'ధూత' అనే బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'తండేల్' అనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ సినిమాలో నటించిన 'మేజర్' బ్యూటీ శోభితా ధూళిపాళ.. 'సితార' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల వచ్చిన 'కల్కి 2989 AD' మూవీలో దీపికా పదుకునే పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. 

Also Read: సరిపోయింది - ‘సరిపోదా శనివారం’ కథంతా రివీల్ చేసిన విలన్ ఎస్.జె. సూర్య

టాప్ హెడ్ లైన్స్

Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Mr Perfect Case: 'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget