అక్కినేని నాగ చైతన్యతో శోభితా ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అసలు, ఎవరీ శోభితా ధూళిపాళ? శోభితా ధూళిపాళ తెలుగమ్మాయి. తెనాలిలో పుట్టారు. విశాఖలో పెరిగారు. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ విన్నర్ శోభితా ధూళిపాళ. అందాల పోటీల్లో నెగ్గిన తర్వాత అనురాగ్ కశ్యప్ 'రమణ్ రాఘవ్ 2.0'తో సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. హిందీలో మూడు సినిమాలు చేశాక... తెలుగులో 'గూఢచారి'లో సమీర, 'మేజర్'లో ప్రమోద రెడ్డి పాత్ర చేశారు. అక్కినేని హీరోలతో శోభిత నటించలేదు. మరి, నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. హిందీ సినిమాలు చేసినప్పుడూ... శోభిత మీద ఇటువంటి రూమర్స్ రాలేదు. తొలిసారి ఆమెపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. రెండు మలయాళ సినిమాల్లోనూ శోభితా ధూళిపాళ నటించారు. తమిళంలో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కీలక పాత్రలో శోభితా ధూళిపాళ నటించారు. డేటింగ్ రూమర్స్ మీద శోభితా ధూళిపాళ స్పందించలేదు.