సీనియర్ నటి పవిత్ర లోకేష్ పేరు ఇటీవల మీడియాలో బాగా వినిపిస్తోంది.
పవిత్ర లోకేష్ సీనియర్ నటుడు నరేష్‌ను పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ కర్ణాటకలో గొప్ప నటుడు, రచయిత.
థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు సుచేంద్రతో పవిత్రకు పరిచయం ఏర్పడింది.
సుచేంద్ర తన మొదటి భార్యకు విడాకులిచ్చి 2007లో పవిత్రాను పెళ్లి చేసుకున్నారు.
సుచేంద్ర, పవిత్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర తన భర్తకు ఇంకా విడాకులు ఇవ్వలేదు.
‘దొంగోడు’ సినిమాతో పవిత్ర టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
పవిత్ర కన్నడ నటుడు మైసూర్ లోకేష్ కూతురు. నటన అంటే ఆమెకు అస్సలు ఇష్టం లేదు.
16 ఏళ్ల వయస్సులో ఆమె గుండె పగిలే విషాదం చోటుచేసుకుంది. తండ్రి లోకేష్ మరణించారు.
ఇష్టం లేకున్నా.. పవిత్ర సినిమాల్లో నటించాల్సి వచ్చింది. సివిల్స్ కోసం మధ్యలో ఆమె సినిమాలు వదిలేశారు.
సివిల్స్‌కు ప్రయత్నించి విఫలం కావడంతో ఆమె మళ్లీ సినిమాల్లో కొనసాగారు.
సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర పెళ్లి వార్తలను ఆయన పీఆర్ టీమ్ ఖండించింది.