Tegimpu First Single: మంచి డ్యాన్సింగ్ ట్యూన్‌తో వచ్చిన అజిత్ - పాట వింటేనే ‘చిల్ చిల్ చిల్’!
అజిత్ హీరోగా నటిస్తున్న ‘తెగింపు’ మొదటి పాట ‘చిల్ చిల్ చిల్’ వచ్చేసింది.
విజయ్ ‘వారసుడు’తో పాటు సంక్రాంతికి రానున్న మరో తమిళ డబ్బింగ్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘తెగింపు’. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘చిల్ చిల్ చిల్’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు గిబ్రాన్ మంచి ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారు. తమిళంలో ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ ఆలపించగా, తెలుగులో యాసిన్ నజీర్ గాత్రం అందించారు.
సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదట జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు అంతకంటే ముందే రానుందని తెలుస్తోంది. ‘వారిసు’ డేట్ కోసం ‘తునివు’ టీమ్, ‘తునివు’ డేట్ కోసం ‘వారిసు’ టీమ్ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ముందు ప్రకటిస్తే వారి కంటే ఒక రోజు ముందు మరో బృందం ప్రకటిస్తుందని టాక్.
ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను నిర్మాతలు ఇటీవలే విడుదల చేశారు. బ్యాంక్ దోపిడి దొంగగా అజిత్ ఈ సినిమాలో కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అజిత్‌తో ‘వలిమై’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తెలుగులో ‘తెగింపు’ అనే టైటిల్ పెట్టారు.
నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళ నటుడు అజిత్ కు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల కారణంగా అజిత్ తెలుగు మార్కెట్ దారుణంగా దెబ్బతింది. కానీ సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకులు అజిత్‌ను మళ్లీ ఆదరిస్తారు.
అజిత్ కుమార్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. నెగిటివ్ షేడ్స్‌లో అజిత్ నటన ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. ‘గ్యాంబ్లర్ (తమిళంలో మంకాతా)’, ‘వేదాళం’ సినిమాల్లో నెగిటివ్ షేడ్‌లో అజిత్ సూపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు అదే నెగిటివ్ షేడ్‌తో ‘తెగింపు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి సినిమాలో నెగిటివ్ షేడా లేకపోతే పాజిటివ్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది.
Once a Ruler 👑 Always a Ruler ❤️🔥 The Reign Continues!#ChillChillChill is Out Now in Telugu. Tune In Now!https://t.co/Ua93Brsiv4#Tegimpu #NoGutsNoGlory
— Boney Kapoor (@BoneyKapoor) January 4, 2023
Tegimpu AP and TS release by @Radhakrishnaen9 @IVYProductions9#Ajithkumar #HVinoth @ZeeStudios_ @BayViewProjOffl pic.twitter.com/7nbfvDb3bx
View this post on Instagram