Ajith Kumar: రేసింగ్ వర్సెస్ మూవీస్ - అజిత్ కుమార్ కీలక నిర్ణయం
Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేసింగ్ సీజన్ ఉన్న టైంలో మూవీస్‌కు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నానని తనకు అర్థమైందన్నారు.

Ajith Kumar About Racing And Movies: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ రీసెంట్‌గా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మూవీస్ నుంచి ఎప్పుడు క్విట్ అవుతానో తనకే తెలియదంటూ కామెంట్ చేయగా వైరల్ అయ్యాయి. ఆయన మూవీస్ నుంచి రిటైర్ అవుతున్నారంటూ చర్చ సాగింది.
కొత్త మూవీపై అనౌన్స్‌మెంట్
ఈ క్రమంలో తాజాగా అజిత్ (Ajith) ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూవీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్‌లో తన తర్వాత మూవీ ప్రారంభం కానుందని.. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే.. రేసింగ్‌పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మూవీస్, రేసింగ్ ఈ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని తనకు అర్థమైందని అన్నారు. అందుకే.. రేసింగ్ సీజన్ ఉన్న టైంలో మూవీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రెండూ ఇంపార్టెంటే
తనకు రేసింగ్, మూవీస్ రెండూ ఇంపార్టెంటే అని అజిత్ అన్నారు. రేసింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు. అలాగే.. తన సినిమాల్లో తానే స్టంట్స్ చేస్తానని.. దాని వల్ల ఎన్నో సర్జరీలు సైతం జరిగాయని అన్నారు. ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కు.. సర్జరీలు జరిగాయని యాక్షన్ సినిమాలు వదిలేయలేనని.. తన దృష్టిలో రెండూ ఒకలాంటివేనని చెప్పారు. 'రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి ఫిట్ నెస్ ఎంతో అవసరం. చాలా రోజుల తర్వాత కార్ల రేసింగ్‌పై దృష్టి పెట్టినప్పుడు ముందు ఫిజికల్‌గా మారాలని అర్ధమైంది. స్విమ్మింగ్, సైక్లింగ్‌తో పాటు ఇతర వర్కౌట్లు, డైట్ చేశా.
గత 8 నెలల కాలంలో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. రేసింగ్ - సినిమా ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దీని వల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అజిత్ వెల్లడించారు.
ఇటీవలే అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. జనవరిలో జరిగిన 24 హెచ్ దుబాయ్ కార్ రేసింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఇందులో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే, ఇటలీలో 12 హెచ్ రేస్‌లోనూ మూడో స్థానం దక్కించుకుంది. బెల్జియంలో నిర్వహించిన స్పా - ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్ సర్క్యూట్‌లోనూ ఆయన టీం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇటీవలే రిటైర్మెంట్ కామెంట్స్
ఇటీవల అజిత్ చేసిన రిటైర్మెంట్స్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. తాను మూవీస్ నుంచి ఎప్పుడు క్విట్ అవుతానో తనకే తెలియదని.. బలవంతంగానైనా మూవీస్ వీడాల్సి రావొచ్చని అన్నారు. తాను ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని అనుకుంటున్నానని.. ఆడియన్స్ తన యాక్టింగ్‌పై కూడా కంప్లైంట్ చేస్తారేమో తనకు తెలియదని చెప్పారు. 'ఆడియన్స్‌లో నాకు ఎక్కువ క్రేజ్ ఉన్నప్పుడే నేను రిటైర్ అవుతానేమో. జీవితం చాలా విలువైనది. నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా మంది జీవితాల్లో పోరాటాలు చేస్తున్న వారు ఉన్నారు.' అని పేర్కొన్నారు.






















