Ajith Kumar: అజీత్‌తో మూవీని తిరస్కరించిన షాలిని - అదే వారి ప్రేమకు తొలి అడుగు
Ajith Kumar: సినీ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్ అజిత్, షాలినీ. ఈ మధ్య వీళ్లు తమ 24వ మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.
Ajith Kumar And Shalini Love Story: అజిత్, షాలినీ క్యూట్ కపుల్. సినిమా ఫీల్డ్ కి చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. ఈ మధ్యే వాళ్లు 24వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఈ మధ్య కాలంలో వీళ్లు మీడియాకి దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగాయాక్టివ్ కనిపించడం లేదు. ఇంటర్వ్యూలు లాంటి కూడా ఇవ్వడం లేదు. అయితే, వాళ్లిద్దరు ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. మ్యారేజ్ యానివర్సీ సందర్భంగా వాళ్లిదరు డిన్నర్ కి వచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ల లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అజిత్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు.
కాలం ఇద్దరినీ కలిపింది..
'అమర్ కలాం' సినిమా అజిత్ సినీ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్. 1998లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. శరణ్ డైరెక్షన్ లో అజిత్ చేస్తున్న రెండో సినిమా అది. అయితే, దాంట్లో షాలినీ అయితే బాగుంటుందని అనుకున్నారట ప్రొడక్షన్ టీమ్. దీంతో ఆమెను కన్సల్ట్ అవ్వగా ఒప్పుకోలేదట. చదువుకోవాలని చెప్పారట. అజిత్ కూడా షాలినీని యాక్ట్ చేయమని అడిగితేజజ ఆమె ఒప్పుకోలేదట. కానీ ఆ తర్వాత కాలమే తనని షాలినీని కలిపింది అని అన్నాడు అజిత్. ఆ టైంలో ఏర్పడిన పరిచయం పెళ్లి చేసుకునేలా దారితీసిందని అన్నారు అజిత్. “అమర్ కలాం సినిమా చేయమని షాలినీని బతిమిలాడారు ప్రొడక్షన్ టీమ్. ఆమె చదువుకోవాలని సినిమాలు చేయను అని తేల్చి చెప్పారు. తర్వాత నేను స్వయంగా ఆమెను అప్రోచ్ అయ్యాను. చాలా కన్విన్స్ చేశాను అస్సలు ఒప్పుకోలేదు. చదువుకోవాలి అని చెప్పింది. దీంతో షాలినీ ప్లేస్ లో మరెవరినైనా పెట్టాలి అనుకున్నారట. కానీ, షాలినీనే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్లీ ఆమె చుట్టూ తిరిగి, ఆమెను ఒప్పించారు ప్రొడక్షన్ వాళ్లు. దీంతో షాలినీ నాతో కలిసి నటించింది. అలా ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. అలా కాలం మా ఇద్దరినీ కలిపింది” అని అన్నారు అజిత్.
బేబీ షాలినీగా షూట్ లో చూశాను..
షాలినీ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్నో హిట్ సినిమాలు చేశారు ఆమె. అయితే , బేబీ షాలీనీని షూటింగ్ లో చూశానని, కానీ అప్పుడు ఆమె నా వైఫ్ అవుతుందని అనుకోలేదని అన్నారు అజిత్. “ నేను అప్పుడు చెన్నైలో ఉంటున్నాను. అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. నేను సైలెంట్ గా స్మోక్ చేసేందుకు పక్కకు వెళ్లాను. అక్కడ షూట్ జరుగుతుంది. బేబీ షాలినీ సినిమా అని తెలిసి వెళ్లి చూశాను. అప్పుడు అనుకోలేదు ఆమె నా భార్య అవుతుందని" అని అన్నారు అజిత్. ఈ సందర్భంగా ఆయన మరో ఇన్సిడెంట్ పంచుకున్నారు. "షాలీనీ నేను కలిసి చేసిన ఫస్ట్ సీన్ లో నేను ఆమెకు రక్తం వచ్చేలా చేశాను. షేవింగ్ చేసే కత్తిలో బ్లేడ్ లేకుండా ఉండాలి. కానీ, పొరపాటున బ్లేడ్ తో ఇచ్చారు. దీంతో నేను ఆమెను కోసినట్లు యాక్ట్ చేయడంతో నిజంగానే రక్తం వచ్చింది. దాన్ని ఆమె దాచుకున్నారు. కానీ, తర్వాత చూసి చాలా ఫీల్ అయ్యాను" అని చెప్పారు అజిత్.