News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Agent Movie: కష్టాల్లో ‘ఏజెంట్’ నిర్మాత అనిల్ సుంకర, కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్

‘ఏజెంట్’ విడుదలయ్యి ఇప్పటికీ మూడు నెలలు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరిపై దీని డిసాస్టర్ ఎఫెక్ట్ పడుతోంది.

FOLLOW US: 
Share:

ఒక సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించినా.. అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఈమధ్య రొటీన్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడడం లేదు. అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ డిజాస్టర్‌కు ఇది కూడా ఒక కారణమే. ‘ఏజెంట్’ విడుదలయ్యి ఇప్పటికీ మూడు నెలలు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరిపై దీని డిజాస్టర్ ఎఫెక్ట్ పడుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించి మూవీ టీమ్ అంతా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు సమాచారం. ఒక్క తప్పు లెక్క వల్ల పరిస్థితులు ఎంతలా మారిపోగలవు అని ‘ఏజెంట్’ మరోసారి ప్రూవ్ చేస్తోంది.

స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. అఖిల్‌ను మరింత స్టైలిష్‌గా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమే ‘ఏజెంట్’. ఈ మూవీ పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ‘ఏజెంట్’ టీమ్ అంతా సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ప్రమోషన్స్ కూడా చేసింది. కానీ విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షో నుండే సినిమాకు విపరీతంగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ దగ్గర నుండే ‘ఏజెంట్’పై దెబ్బపడింది. నిర్మాతలు అనేవారు బడ్జెట్‌ను ఎప్పుడూ సరిగ్గా లెక్కించాలి. కాస్త అటు, ఇటు అయినా కూడా వారిపై పడే ఆర్థిక భారం కొన్నేళ్లు అయినా తీర్చలేనిదిగా మారిపోతుంది. ‘ఏజెంట్’ విషయంలో అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ బడ్జెట్‌ను ఖర్చుపెట్టిన నిర్మాత.. ఇప్పుడు ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్..
‘ఏజెంట్’ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాడు నిర్మాత అనిల్ సుంకర. ఈ మూవీ థియేటర్లలో ఫ్లాప్ అయినా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో అయినా జరిగిన నష్టాన్ని కవర్ చేద్దామని ట్రై చేశాడు. ఆ ప్లాన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇక థియేటర్లలో భారీ డిసాస్టర్‌గా నిలవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఈ నష్టాన్ని ఎలా కవర్ చేయాలని అయోమయంలో పడ్డారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నా.. ఒక ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఈ విషయంపై కోర్టుకెక్కాడు. తమకు జరిగిన నష్టానికి నిర్మాత అనిల్ సుంకర పూర్తి బాధత్య వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా యాక్షన్ మూవీ కావడంతో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో అఖిల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. మమ్ముట్టి లాంటి మలయాళ సూపర్‌స్టార్‌ను చాలా ఏళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ ఇవేవి ‘ఏజెంట్‌’ను డిసాస్టర్ నుండి కాపాడలేకపోయాయి.

సరైన స్క్రిప్ట్ లేకుండానే..
‘ఏజెంట్’ విడుదలయ్యి నెగిటివ్ టాక్ అందుకోగానే.. తప్పు తమదేనంటూ నిర్మాత అనిల్ సుంకర ఒక నోట్‌ను విడుదల చేశారు. సరైన స్క్రిప్ట్ లేకుండా సినిమాను ప్రారంభించామని ఓపెన్‌గా తెలిపాడు. దీంతో అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఫైర్ అయ్యారు. అసలు సరైన స్క్రిప్ట్ లేకుండా కేవలం ఒక యాక్షన్ సినిమా మీద అంత బడ్జెట్‌ను పెట్టడం మూర్ఖత్వం అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం నిర్మాత అనిల్ సుంకర.. ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ‘ఏజెంట్’ మిగిల్చిన నష్టాన్ని ‘భోళా శంకర్’ ఎంతమేరకు తీర్చగలడో చూడాలి.

Also Read: హీరోల రెమ్యూనరేషన్లపై పార్లమెంటులో చర్చ దురదృష్టం - చిరంజీవి స్పీచ్ Full Video చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 10 Aug 2023 10:51 AM (IST) Tags: Akhil Akkineni Anil Sunkara Bholaa Shankar Agent Surender Reddy disaster

ఇవి కూడా చూడండి

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత