అన్వేషించండి

Sakshi Vaidya : రవితేజ సరసన 'ఏజెంట్' బ్యూటీ - అసలు నిజం ఇదే!

Sakshi Vaidya : జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ - రవితేజ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో 'ఏజెంట్' బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సమాచారం.

Agent Movie Heroine In Mass Raja’s Film : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. హిట్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న మాస్ రాజా రీసెంట్ గా 'ఈగల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా నిరాశపరిచినా.. సినిమాలో రవితేజ గెటప్, పెర్ఫార్మన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా 'జాతి రత్నాలు' డైరెక్టర్ అనుదీప్ తో రవితేజ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'ఏజెంట్' బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. 

రవితేజకి జోడిగా 'ఏజంట్' బ్యూటీ.. అసలు నిజం ఇదే

అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ 'గాండీవ దారి అర్జున'లో నటించింది. ఆ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. టాలీవుడ్ లో ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న కూడా ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ - అనుదీప్ కాంబో మూవీలో సాక్షి వైద్య హీరయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా సాక్షి వైద్య సైన్ చేసిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం అందులో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమాలో రవితేజ సరసన 'సప్త సాగరాలు దాటి' మూవీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా సాక్షి వైద్య తెలుగులో ఇప్పటికే శర్వానంద్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు తో 'సామజవరగమన' లాంటి సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేస్తున్నారు.

త్వరలోనే షూటింగ్

'జాతి రత్నాలు' తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాడు డైరెక్టర్ అనుదీప్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్' అనే సినిమా చేశాడు. అయితే ఆ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఈసారి రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేశారట. రవితేజ సైతం ఈ మూవీ కోసం ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుందట.

'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో రవితేజ

రవితేజ ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్‌ను కరైకుడిలో ప్లాన్ చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' చిత్రానికి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Also Read : 'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు - సినిమాకి రెండో భాగం కూడా ఉంది : నిర్మాత ఏ.ఎం రత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
Embed widget