అన్వేషించండి

'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు - సినిమాకి రెండో భాగం కూడా ఉంది : నిర్మాత ఏ.ఎం రత్నం

AM Rathnam : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాపై నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఆసక్తికర అప్డేట్స్ అందించారు.

Hari Hara Veera Mallu to be released in 2 parts : క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా అనౌన్స్ చేసి సుమారు నాలుగేళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య సినిమా ఆగిపోయింది అనే న్యూస్ కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఏఎమ్ రత్నం పలు ఆసక్తికర అప్డేట్స్ అందించారు.

'హరిహర వీరమల్లు' రెండో భాగం కూడా ఉంది - ఏఎం రత్నం

తాజాగా ఓ పబ్లిక్ మీట్ లో ‘హరిహర వీరమల్లు' సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత ఏఎమ్ రత్నం. ఈ మేరకు సినిమా ఆగిపోయింది అనే మాట వాస్తవం కాదని చెబుతూ మరో అప్డేట్ ఇచ్చారు.." పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే ఓ 20 రోజులు ఆయన డేట్స్ ఎలాగోలా తీసుకుని సినిమా చేసే వాడిని. కానీ ఆయనతో చేసే సినిమా గుర్తుండిపోవాలి. ఇండియా లెవెల్ లో ఆయన ఏంటో తెలియాలి అనే స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాం. వైసీపీ మీడియా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. హరిహర వీరమల్లు సినిమాకి రెండో భాగం కూడా ఉంటుంది" అంటూ తెలిపారు. ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

డైరెక్టర్ గా తప్పుకున్న క్రిష్

'హరిహర వీరమల్లు' సినిమా నుంచి దర్శకుడిగా క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ ని క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేయడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అవుట్ పుట్ చూసి పవన్ అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినా కూడా పవన్ కి నచ్చలేదని చెబుతున్నారు. ఇప్పుడు క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు, దానికి తోడు బడ్జెట్ సమస్యలు ఏర్పడడంతో సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.  ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also Read : ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget