RaviTeja : మహేష్, బన్నీకి పోటీగా రవితేజ నయా బిజినెస్ - మాస్ రాజా ప్లానింగ్ మాములుగా లేదుగా!
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం.
Raviteja to own a multiplex : టాలీవుడ్ లో ఉన్న పలువురు స్టార్ హీరోలు సినిమాలతో పాటు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది నిర్మాతలుగా మరికొంతమంది రియల్ ఎస్టేట్ లో ఇంకొంతమంది సినిమా అనుబంధ వ్యాపారాలు అంటే మల్టీప్లెక్స్ బిజినెస్ లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ మల్టీప్లెక్స్ బిజినెస్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు 'AMB' సినిమాస్ మల్టీప్లెక్స్ ని స్థాపించగా.. ఈమధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం 'AAA' సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాదే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది ఇక ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ హీరో వెళ్తున్నట్లు తాజా సమాచారం.
మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ ఎంట్రీ
మాస్ మహారాజా రవితేజ ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు RT టీం వర్క్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ సుఖ్ నగర్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నారట. ఏకంగా ఆరు స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ మల్టీప్లెక్స్ కి ART(Assian Ravi Teja) సినిమాస్ అని నామకరణం కూడా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
'ఈగల్'తో నిర్మాతలకు నష్టాలు
మాస్ మహారాజా రవితేజ.. చాలాకాలం తర్వాత 'ఈగల్'తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. చాలా ప్రాంతాల్లో సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో మాత్రం వీక్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ కూడా దక్కలేదు. ఈ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకి దాదాపు రూ.25 కోట్లు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రవితేజతో వరుస సినిమాలు చేస్తుండగా.. అందులో 'ధమాకా' సినిమా మాత్రమే సక్సెస్ అయ్యింది.
'మిస్టర్ బచ్చన్' షూటింగ్ తో బిజీ బిజీగా
రవితేజ ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని కర్తెకుడిలో ప్లాన్ చేశారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
Also Read : స్మశానవాటికలో టీజర్ లాంచ్ - ఇదెక్కడి మాస్ ప్లానింగ్ మావా బ్రో!