G2 Movie Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'G2' రిలీజ్ డేట్ వచ్చేసింది - 6 కంట్రీస్... 150 డేస్... 23 సెట్స్...
Adivi Sesh: యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'G2'పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను హీరో అడివి శేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

Adivi Sesh's G2 Movie Release Date Announced: యంగ్ హీరో అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా 'G2' మూవీ తెరకెక్కుతుండగా... తాజాగా అడివి శేష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీ మే 1, 2026న రిలీజ్ చేయనున్నట్లు అడివి శేష్ తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. 6 దేశాల్లో 23 సెట్స్‌లో 150 రోజులు షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. 'ఇప్పటివరకూ నేను సైలెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే మేం ఓ ఎక్స్‌ప్లోజివ్ థ్రిల్లర్ నిర్మిస్తున్నాం. 6 దేశాల్లో షూటింగ్. 23 సెట్స్, 150 రోజులు. 5 భాషల్లో రిలీజ్. నా అతి పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది మేడే రోజున థియేటర్లలో కలుద్దాం.' అంటూ ట్వీట్ చేశారు.
I was silent until now.
— Adivi Sesh (@AdiviSesh) August 4, 2025
Because we have been building something EXPLOSIVE.
Shooting in six countries. 23 sets. 150 days. Releasing in 5 languages.
My BIGGEST.
Exploding worldwide
MAY DAY !
May 1, 2026
In Theaters. pic.twitter.com/Eyb8vbY0BG
Also Read: రూ.100 కోట్ల క్లబ్‌లో 'మహావతార్: నరసింహ' - సక్సెస్ ట్రైలర్‌లో విజువల్ వండర్ చూశారా!
'గూఢచారి' మూవీకి సీక్వెల్‌గా...
2018లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి' ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. ఈ మూవీలో అడివి శేష్ సరసన శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌గా నటించగా... శశికిరణ్ టిక్క దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు అంతకు మించి యాక్షన్ సీక్వెన్స్‌తో సీక్వెల్ 'G2' తెరకెక్కుతోంది.
సీక్వెల్‌కు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... అడివి శేష్ సరసన వామికా గబ్బీ హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్‌లో నటించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. 'గూఢచారి' మొత్తం ఇండియాలోనే జరగ్గా... సీక్వెల్ పార్ట్ అంతర్జాతీయంగా జరగనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా ఇందులో కనిపించే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆమె ఓ బుల్లెట్
'G2' రిలీజ్ డేట్‌తో పాటు షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ విశేషాలను సైతం తాజాగా అడివి శేష్ పంచుకున్నారు. హీరోయిన్ వామికా గబ్బీ యాక్షన్ అద్భుతమని ప్రశంసించారు. 'వామికాతో షూటింగ్ అసాధారణంగా ఉంది. ఆమె అద్భుతమైన విన్యాసాలు, యాక్షన్ సీక్వెన్స్ చేయగల నటి. ఈ మూవీలో ఆమె ఓ ఆశ్చర్యకరమైన బుల్లెట్.' అంటూ ట్వీట్ చేశారు.
Shooting with #Wamiqa has been extraordinary. She’s a Phenomenal actress who can do phenomenal stunts. She’s the surprise bullet in the film.
— Adivi Sesh (@AdiviSesh) August 4, 2025
See you in theaters May 1, 2026! #G2 #Goodachari2 pic.twitter.com/xGBJ4t6iEA





















