Adivi Sesh: అప్పుడు ఫైటింగ్, ఇప్పుడు మీటింగ్, చిరంజీవి గురించి అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరో అడవి శేష్, చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ఆయన చేతుల మీదుగా సంతోషం అవార్డు అందుకున్న సందర్భంగా చిన్నప్పటి నుంచి తనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. యూనిక్ కంటెంట్ తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించడంలో తనకు తానే సాటి. ‘క్షణం’, ‘ఎవరు’, ‘గూఢాచారి’, ‘మేజర్’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. తాజాగా ‘HIT-2’తో సత్తా చాటారు. తాజాగా ఈ సందర్భంగా ఆయన ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అదీ మెగాస్టార్ చిరంజీవి గురించి.
ఫైటింగ్ నుంచి మీటింగ్ వరకు ఎన్నో జ్ఞాపకాలు
‘HIT-2’ కంటే ముందు అడవి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాకు గాను అడవి శేష్ అవార్డును అందుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయనతో తన ప్రయాణం గురించి ప్రస్తావించారు. తాను చిన్నప్పటి నుంచి గొప్ప నటుడిగా భావించే మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవితో అవార్డును అందుకోవడం కంటే గొప్ప విషయం మరేదీ లేదన్నారు. “చిన్నప్పటి నుంచి చిరంజీవి అంతే తనకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాల టికెట్ల కోసం థియేటర్ల దగ్గర పైటింగ్ చేసిన సందర్భాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఒకరోజు ‘మేజర్’ సినిమా గురించి మీతో చర్చించే అవకాశం నాకు దొరకడం పట్ల హ్యాపీగా ఫీలయ్యాను. ఇప్పుడు మీ నుంచి ‘మేజర్’ సినిమాకు గాను అవార్డును అందుకోవడం మాటల్లో చెప్పలేని విషయం. మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్యూ సోమచ్” అని రాసుకోచ్చారు.
‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం
2010లో వచ్చిన ‘కర్మ’ సినిమాతో తెలుగు వెండి తెరకు ఆయన హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశారు. ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో చిన్న పాత్రలే చేసినా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక 2016లో వచ్చిన ‘క్షణం’ సినిమా అడవి శేష్ కెరీర్ ను పెద్ద మలుపు తిప్పింది. దర్శకుడు రవికాంత్ తో కలిసి శేష్ ఈ సినిమా కథ రాశారు. ఆ తర్వాత ‘ఎవరు’, ‘గూఢాచారి’, ‘మేజర్’ లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. తాజాగా ‘HIT-2’తో అద్భుత విజయాన్ని అందుకున్నాడు.
టాలీవుడ్ లో బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు
తాజాగా అడవి శేష్ టాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉందని, అందుకే సినిమాల్లో మెయిన్ రోల్స్ చేయడానికి బయటి వ్యక్తులను ఆడిషన్స్‌కు పిలిచే సాహసం చేయడం లేదని శేష్ అన్నాడు. ‘బాలీవుడ్ హంగామా’ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో శేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో ఆడిషన్స్ సంస్కృతి లేదని తెలిపాడు. ఇప్పటికే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు మెయిన్ రోల్స్ కు నేరుగా సెలక్ట్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. సినిమా కుటుంబం నుంచి రాని వారిని ప్రధాన పాత్రలకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నాడు. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు