By: ABP Desam | Updated at : 24 May 2023 08:39 AM (IST)
'ఆదిపురుష్'లో ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే
శ్రీ రామ చంద్రునిగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా 24 రోజులే ఉంది... థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలు కావడానికి! ఇండియాలో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా? టికెట్స్ కొందామా? అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే... అమెరికాలో ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి!
జూన్ 15న 'ఆదిపురుష్' ప్రీమియర్స్!
Adipurush Premiere Timings : ప్రతి సినిమా ఇండియాలో కంటే అమెరికాలోనే ముందుగా విడుదల అవుతుంది. అక్కడ ప్రీమియర్ షోలు పడతాయి. ఇప్పుడీ 'ఆదిపురుష్' షోలు సైతం అమెరికాలో ముందుగా పడుతున్నాయి. జూన్ 15వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి షోస్ మొదలు అవుతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.
అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ రేటు ఎంత?
Adipurush Ticket Price In USA : అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్టును 20 డాలర్లుకు అమ్ముతున్నారు. ఇది 2డి షో టికెట్ రేటు. త్రీడీ షో అయితే టికెట్ రేటు 23 డాలర్లు మాత్రమే! రీజనబుల్ రేట్లకు టికెట్స్ అమ్ముతున్నారని చెప్పవచ్చు. 'ఆర్ఆర్ఆర్' టికెట్స్ 28 నుంచి 25 డాలర్లకు అమ్మారు. దాంతో పోలిస్తే ఈ రేటు రీజనబులే కదా!
'ఆదిపురుష్' ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన 'జై శ్రీరామ్' పాట సైతం చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే, అంతకు విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
'ఆదిపురుష్'తో ప్రభాస్ విజయం సాధించాలి!
ప్రభాస్ కోసమైనా 'ఆదిపురుష్' విజయం సాధించాలని ఆయన అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. దీని కంటే ముందు ఆయన నటించిన 'రాధే శ్యామ్' బాక్సాఫీస్ బరిలో ఆశించిన విజయం సాధించలేదు. 'సాహో' సినిమా ఉత్తరాదిలో మంచి వసూళ్లు సాధించింది. కానీ, దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో ఆయన అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. అందుకని, 'ఆదిపురుష్' ఎలాగైనా సరే హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇండియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాక సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది? మొదటి రోజు ఎంత కలెక్షన్స్ రావచ్చు? అనేది ఇండియా వస్తుంది.
Also Read : వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?
'ఆదిపురుష్'లో సీతాదేవి అలియాస్ జానకి పాత్రలో హిందీ హీరోయిన్ కృతి సనన్ నటించారు. ఇంతకు ముందుకు తెలుగులో మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగ చైతన్య అక్కినేని 'దోచెయ్' సినిమాలు చేశారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ రెట్రోఫిల్స్ సంస్థతో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : కన్నడ దర్శకుడితో బాలకృష్ణ, రజనీకాంత్ పాన్ ఇండియా మల్టీస్టారర్!?
Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- హడలిపోయిన అధికారయంత్రాంగం!
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్