Adipurush Pre Release : తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ఎప్పుడంటే?
ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రమిది. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు.
శ్రీ రామ చంద్రునిగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అంటే కంటే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. అదీ తెలుగు గడ్డపై!
తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక
Adipurush Pre Release Event Date : ఆధ్యాత్మిక క్షేత్రమైన, హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే ఏడు కొండల శ్రీవాసుడు కొలువన తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ తెలియజేసింది. జూన్ 6వ తేదీ సాయంత్రం భారీ ఎత్తున భక్తులు, ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
'బాహుబలి' ప్రీ రిలీజ్ కూడా...
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక ముఖ్య భూమిక పోషించిన 'బాహుబలి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక సైతం తిరుపతిలో జరిగింది. మరోసారి తిరుపతి గడ్డ మీద ప్రభాస్ సినిమా వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా - మరీ ఇంత దారుణమా?
జూన్ 15న 'ఆదిపురుష్' ప్రీమియర్స్!
Adipurush Premiere Timings : ప్రతి సినిమా ఇండియాలో కంటే అమెరికాలోనే ముందుగా విడుదల అవుతుంది. అక్కడ ప్రీమియర్ షోలు పడతాయి. ఇప్పుడీ 'ఆదిపురుష్' షోలు సైతం అమెరికాలో ముందుగా పడుతున్నాయి. జూన్ 15వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి షోస్ మొదలు అవుతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.
అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ రేటు ఎంత?
Adipurush Ticket Price In USA : అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్టును 20 డాలర్లుకు అమ్ముతున్నారు. ఇది 2డి షో టికెట్ రేటు. త్రీడీ షో అయితే టికెట్ రేటు 23 డాలర్లు మాత్రమే! రీజనబుల్ రేట్లకు టికెట్స్ అమ్ముతున్నారని చెప్పవచ్చు. 'ఆర్ఆర్ఆర్' టికెట్స్ 28 నుంచి 25 డాలర్లకు అమ్మారు. దాంతో పోలిస్తే ఈ రేటు రీజనబులే కదా!
'ఆదిపురుష్' ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన 'జై శ్రీరామ్' పాట సైతం చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే, అంతకు విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Also Read : డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు, అలా ఎలా వదిలేశారు సార్?
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ రెట్రోఫిల్స్ సంస్థతో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ 'ఆదిపురుష్' చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. అజయ్ - అతుల్ సంగీత స్వరకల్పనలో వచ్చిన 'జై శ్రీరామ్' సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిగతా పాటల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.