అన్వేషించండి

'RRR' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'ఆదిపురుష్' - ఎందులోనో తెలుసా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 'ఆర్ ఆర్ ఆర్' హిందీ డే వన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ - ఓం రౌత్ ల మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ముందు నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సౌత్ తో పాటు నార్త్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే ఆదిపురుష్ మూవీ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అయితే ఆదిపురుష్ మూవీకి సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 'ఆర్  ఆర్ ఆర్' హిందీ డే వన్ కలెక్షన్స్ ని దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి మొదటిరోజు  సుమారు రూ.19 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఆదిపురుష్ విషయానికొస్తే ఈరోజు రాత్రికి తొమ్మిది గంటల వరకు ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.18 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆదిపురుష్ మూవీ త్రిబుల్ ఆర్ హిందీ డే వన్ నెట్ కలెక్షన్స్ ని చేరుకుంది. ఇంకా అర్ధరాత్రి, ఎర్లీ మార్నింగ్ షోలతో కలుపుకుంటే 'ఆదిపురుష్' చాలా సులభంగా 'ఆర్ ఆర్ ఆర్' హిందీ డే వన్ నెట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా హిందీలో ఆదిపురుష్ మూవీ మొదటి రోజు సుమారు రూ.35 కోట్ల కు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' డే వన్ టోటల్ కలెక్షన్స్ తో పోల్చుకుంటే  ,'ఆదిపురుష్' డే వన్ కలెక్షన్స్ చాలా ఎక్కువ. కాగా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వలు అనుమతిచ్చాయి.

టికెట్ రేట్లు పెరిగిన కారణంగా ఆదిపురుష్ మూవీ మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా ఇప్పటికే ఈ సినిమాని వీక్షించిన ప్రేక్షకుల నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది ఏమో సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ నటన, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, వి ఎఫ్ ఎక్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని చెబుతుంటే.. మరి కొంత మంది మాత్రం వి ఎఫ్ ఎక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని, సినిమా ఎక్కువగా డార్క్ థీమ్ లో ఉందని, సెకండాఫ్ నిరాశపరిచిందని చెప్తున్నారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టీసీరీస్ బ్యానర్ పై బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ త్రీడి టెక్నాలజీ తో రూపొందిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ - అతుల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

Also Read: నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!

టాప్ హెడ్ లైన్స్

Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget