అన్వేషించండి

Varalakshmi Sarathkumar: డ్రగ్‌ కేసులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అరెస్ట్‌? - ఆ ఛానళ్లపై నటి ఘాటు వ్యాఖ్యలు

Actress Varalakshmi: ప్రస్తుతం పెళ్లీ ఏర్పాట్లతో బిజీగా ఉన్న ఆమె అరెస్ట్‌ కాబోతోందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. డ్రగ్స్‌ కేసులో ఆమెకు ఎన్‌ఐఏ నోటిసులు ఇచ్చిందని, ఆమె అరెస్ట్ కాబోతుందంటూ వార్తలు వచ్చాయి

Actress Varalakshmi Sarathkumar React on Fake News: ఇటీవల ప్రియుడుతో నిశ్చితార్థం చేసుకున్న నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లీ ఏర్పాట్లతో బిజీగా ఉన్న ఆమె అరెస్ట్‌ కాబోతోందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. డ్రగ్స్‌ కేసులో ఆమెకు ఎన్‌ఐఏ నోటిసులు ఇచ్చిందని, ఏ క్షణమైనా ఆమె అరెస్ట్‌ కావోచ్చంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. రెండు రోజులుగా దీనిపై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దాంతో ఈ వార్తలపై స్వయంగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ స్పందించింది. ఇదంత ఉత్త ప్రచారమని, ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేసింది. అదేవిధంగా తనపై ఈ తప్పుడు కథనాలను సృష్టించిన మీడియా ఛానళ్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 

బయట వెయ్యికి పైగా సమస్యలు..

"ఈ మీడియా మిత్రులకు కొత్త వార్తలు లేకపోవడంతో పాత వార్తలనే కొత్తగా సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. ముఖ్యంగా మా ప్రియమైన జర్నలిస్టులు, ప్రత్యేకించి స్వయం ప్రకటిత వెబ్‌సైట్లకు నా విన్నం ఏంటంటే.. మీరు నిజమైన జర్నలిజం ఎందుకు ప్రారంభించకూడదు? ఇకనైనా సెలబ్రిటీలలో లోపాలను వెతకడం మానండి. మేము ప్రజలను అలరించడానికి నటిస్తున్నాం, వారికి వినోదం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం కదా.. మరి మీరూ మీ పనిని ఎందుకు చేయకూడదు?! మీరు శ్రద్ధ పెట్టడానికి బయట 1000కి పైగా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా మౌనాన్ని బలహీనంగా చూడకండి. ఈ మధ్య పరువు నష్టం దావా, కేసులు కూడా ట్రెండ్‌ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి అసత్యా ప్రచారాలు మానేసి, నిజమైన జర్నలిజాన్ని తిరిగి తీసుకురాండి!" అంటూ వరలక్ష్మి ఘాటుగా స్పందించింది. 

ప్రస్తుతం ఆమె ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా, గతేడాది వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దగ్గర పనిచేసే ఫ్రీలాన్స్‌ మేనేజర్‌  ఆదిలింగం డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. అప్పుడే దీనిపై స్పందించిన ఆమె తనకు, డ్రగ్స్‌ కేసుకు ఎలాంటి సంబంధించి లేదని స్పష్టం చేసింది. తన ప్రీలాన్స్‌ మేనేజర్‌ అరెస్ట్‌తో డ్రగ్‌ కేసులో ఆమె పేరు బాగా వినిపించింది. ఆమె స్పందించడం ఈ వ్యవహరం సద్దుమనిగింది. అయితే తాజాగా సడెన్‌ డ్రగ్‌ కేసులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పేరు చేర్చుతూ మళ్లీ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రీసెంట్‌గా ఆమె ఎన్‌ఐఏ డ్రగ్‌ కేసులో నోటీసులు ఇచ్చారని, ఆమెను విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించినట్టు తమిళ మీడియాల్లో కథనాలు పట్టుకొచ్చాయి. అంతేకాదు ఆమెను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందంటూ మరింత ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇది చూసి అంతా నిజం అనుకున్నారు. ఆమె ఫ్యాన్స్‌ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి వరలక్ష్మి స్వయంగా స్పందించింది ఈ వార్తలను ఖండించడంతో ఇందులో నిజం లేదని తేలిసింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ రిలాక్స్‌ అవుతున్నారు. కాగా ఇటీవల హనుమాన్‌ చిత్రంలో అలరించిన వరలక్ష్మి.. తన ప్రియుడు, గ్యాలరిస్ట్‌ నికోలాయి సచ్‌దేవ్‌ను సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget