By: ABP Desam | Updated at : 09 Mar 2023 09:22 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Sreeleela/Instagram
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘NBK108’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా నందమూరి తారకరత్న మరణంతో షూటింగ్ కు విరామం ఏర్పడింది. ఈ మూవీ షూటింగ్ లో నటి శ్రీలీల కూడా పాల్గొంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది.
ఎవరూ ఊహించని విధంగా శ్రీలీలను ఈ సినిమా షూటింగ్ లో పరిచయం చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర ఏమిటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలీల.. బాలయ్య కు కూతురిగా నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు మాత్రం ఆమె శరత్ కుమార్‌కు కూతురుగా నటిస్తుందని అంటున్నారు. మూవీ టీజర్, ట్రైలర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ వస్తుంది.
గతంలో దర్శకుడు అనిల్ ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ఉంటుందని, బాలయ్య క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో శ్రీలీల కూతురి క్యారెక్టర్ చేస్తుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం 20 నుంచి 30 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిందట శ్రీలీల. మూవీలో ఆమె పాత్ర కూడా ఎక్కువసేపు ఉండదని టాక్. అందుకే డెేట్స్ తక్కువగా ఉండటం తో ఈ మూవీకు ఓకే చేసిందట శ్రీలీల.
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కు పరిచయం అయింది శ్రీలీల. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ఇప్పటికే ‘ధమాకా’ సినిమాతో మంచి హిట్ అందుకుంది శ్రీలీల. వీటితో పాటు పలు పెద్ద ప్రాజెక్టులలో శ్రీలీల భాగం అవ్వబోతోంది. బాలయ్య సినిమా షూటింగ్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది శ్రీలీల.
ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో బాలకృష్ణ ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారని సమాచారం. మూవీలో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని అంటున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు థమన్ పవర్ ఫుల్ సంగీతాన్ని అందించారు. తాజాగా మరోసారి బాలయ్య సినిమాకు థమన్ పనిచేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుందని ప్రచారంలో ఉంది. అయితే దీనిపై కూడా త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నారు మేకర్స్.
Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా!
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Dasara Box Office : తెలంగాణలో చిరు, బాలయ్య సినిమాలను దాటేసిన 'దసరా' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Rohini Theatre Issue: రజనీ కాంత్ ఫ్యామిలీకి వర్తించని రూల్స్, వారికి ఎందుకు? ఆ థియేటర్ నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం
Manisha Koirala: ‘బొంబాయి’ సినిమా చేయకూడదు అనుకున్నాను, ఆయన వల్లే చేశా: మనీషా కొయిరాలా
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?