Nivetha Pethuraj: పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్... 2025 ఎండింగ్‌లో ఏడడుగులు - వరుడు ఎవరో తెలుసా?
Nivetha Pethuraj Wedding: హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్ళికి సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖరిలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. ఇంతకీ, ఆవిడను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా?

హీరోయిన్ నివేద పేతురాజ్ (Nivetha Pethuraj) గుర్తున్నారా? అంటే తెలుగు తెరపై ఆవిడ కనిపించి రెండు సంవత్సరాలు దాటుతోంది. మరి ఇప్పుడు ఏం చేస్తోంది? అంటే... పెళ్లికి రెడీ అవుతోంది. ఆవిడ వినాయక చవితికి సర్ప్రైజ్ ఇచ్చింది. తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.
నివేదా పెతురాజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?
Nivetha Pethuraj Husband Name: రజిత్ ఇబ్రాన్... నివేదాను పెళ్లాడబోయే వ్యక్తి పేరు. అతనొక వ్యాపారవేత్త. తమిళ్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యాపార పనుల నిమిత్తం పారిస్, న్యూయార్క్, హాంకాంగ్ అంటూ వివిధ నగరాలు (దేశాలు) తిరుగుతూ ఉంటాడు. ఒక ఫ్యాషన్ షోలో నివేదాతో పరిచయం అయినట్లు, ఆ పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలిసింది.
నివేదా పెతురాజ్, రజిత్ ఇబ్రాన్... ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధం అయ్యారు. ఈ ఏడాది ఆఖరిలో ఏడు అడుగులు వేయనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.
Also Read: పండగపూట షూటింగ్స్... పూజల్లేవ్... ఫ్యామిలీతో ఫెస్టివల్ మిస్ అయిన స్టార్ హీరోస్ వీళ్ళే!
View this post on Instagram
తెలుగులో నివేదా నటించిన సినిమాలు తెలుసా?
Nivetha Pethuraj Telugu Movies List: శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన హిట్ సినిమా 'మెంటల్ మదిలో'తో నివేదా పేతురాజ్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ సరసన 'చిత్రలహరి' సినిమాలో నటించారు. అలాగే శ్రీవిష్ణు 'బ్రోచేవారెవరురా', రామ్ పోతినేని 'రెడ్', విశ్వక్ సేన్ 'పాగల్', 'దాస్ కా ధమ్కీ' సినిమాలు చేశారు. రానా దగ్గుబాటి 'విరాటపర్వం'లో అతిథి పాత్ర చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించారు. అందులో ఆమెది సుశాంత్ ప్రేమలో పడే అమ్మాయి రోల్. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారో లేదంటే గుడ్ బై చెబుతారో? వెయిట్ అండ్ సి.
Also Read: అందాల భామల ఇంట గణేష్ చతుర్థి... పూజలు చేసిన హీరోయిన్లు... ఎవరెలాంటి డ్రస్ వేశారో చూడండి




















