Actress Lirisha: మోహన్ బాబు నన్ను కావాలనే తోసేశారు - సీనియర్ నటి లిరీష
Actress Lirisha: సీనియర్ నటి లిరీష.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న సమయంలో ‘పొలిటికల్ రౌడీ’ చిత్రం తనకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా అనుభవాలను ఆమె గుర్తుచేసుకున్నారు.
Actress Lirisha about Mohan Babu: ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెలిగిన ఎంతోమంది నటీమణులు.. తర్వాత బుల్లితెరపైకి షిఫ్ట్ అయిపోయారు. ప్రస్తుతం బుల్లితెరపై కనిపిస్తున్న ఎంతోమంది ఆర్టిస్టులు ఒకప్పుడు సినిమాల్లో నటించినవారే. అందులో ఒకరు లిరీష. అయితే తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ తనకు ముందుగా ఎక్కువ నిడివి క్యారెక్టర్ లభించింది ‘పొలిటికల్ రౌడీ’ సినిమాలోనే అని గుర్తుచేసుకున్నారు. ఆదినారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబుకు జోడీగా ఛార్మీ నటించగా.. తన ఫ్రెండ్ పాత్రలో లిరీష కనిపించారు. ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకుంటూ మోహన్ బాబుపై లిరీష చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చాలా ఫ్రెండ్లీ..
‘‘పొలిటికల్ రౌడీలో నన్ను చూడాలి. మామూలు అద్భుతం కాదు. కళాఖండంలాగా ఉంటుంది’’ అంటూ ‘పొలిటికల్ రౌడీ’ తన పాత్రను గుర్తుచేసుకుంటూ తెగ నవ్వేశారు లిరీష. ‘‘నాకు మామూలుగా మోహన్ బాబు అంటే భయం. చాలామందికి భయముండేది. ఆయనను సడెన్‌గా చూసేసరికి ఇంకా భయమేసింది. కానీ ఆయన చాలా ఫ్రెండ్లీ. మొదటి రోజు వెళ్లి హాయ్ సార్ అన్నాను. ఓకే నువ్వేనా అన్నారు. అంతే ఇంకేం మాట్లాడలేదు. భయపడమంటే ఎలా భయపడాలో తెలియలేదు. ఆ తర్వాత బాగానే చేశాను’’ అంటూ ‘పొలిటికల్ రౌడీ’ అనుభవాలను గుర్తుచేసుకున్నారు లిరీష.
ఇది యాక్టింగ్..
‘‘మొదటి మూవీ పొలిటికల్ రౌడీలోనే చేసిందే చేస్తున్నానని అరిచారు. అందులో ప్రకాశ్ రాజ్ నన్ను తోసేసే సీన్ ఒకటి ఉంది. అప్పుడు నా అంతట నేనుగా కిందపడాలి. ఆ సీన్‌లో ఎంత కష్టపడినా నేను కింద పడలేకపోతున్నా. ఎందుకు పడాలి నేను పడను అన్నాను. మోహన్ బాబు చూసి చూసి వెనుక నుంచి వచ్చి ఒక్క తోపుతోశారు. కింద పడిపోయాను. షాక్ అయ్యి చూస్తే అప్పుడు కరెక్ట్‌గా వచ్చిందన్నారు. తర్వాత వెంటనే నీళ్లు, క్రీమ్ అన్నీ తెప్పించారు. అప్పుడు కింద రాళ్లు ఉండడం వల్ల చేతులు, కాళ్లు కొట్టుకుపోయాయి. మోహన్ బాబు మాత్రం ఇది యాక్టింగ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదంతా మంచి ఎక్స్‌పీరియన్స్’’ అంటూ తన కెరీర్ మొదట్లో ఒక సీన్ కోసం పడిన కష్టం గురించి చెప్పారు.
అదే నేర్చుకున్నాను..
‘‘మోహన్ బాబు నన్ను కూర్చుబెట్టుకొని మాట్లాడేవారు. ఆయన సినిమాలో ఉదయం 5 గంటల వరకు, ఆయన వచ్చేముందే నేను సెట్‌లో ఉండేదాన్ని. ఒకసారి లేట్ అయితే ఎవరికో క్లాస్ పీకడం చూశాను. అప్పటినుంచి నాకు అలా జరగకూడదని పొద్దునే అక్కడ ఉండేదాన్ని. మోహన్ బాబు దగ్గర అదే నేర్చుకున్నాను. ఒక యాక్టర్ క్రమశిక్షణతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను’’ అంటూ మోహన్ బాబు గురించి మాట్లాడారు లిరీష. ఇక తను ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో కమెడియన్ ఆలీ పరిచయం అయ్యారని, ఆయన వల్లే ‘పొలిటికల్ రౌడీ’లో అవకాశం వచ్చిందని బయటపెట్టారు.
Also Read: ‘సేవ్ ది టైగర్స్’లో ప్రియదర్శి భార్య క్యారెక్టర్ నాదే, ఆ పాత్రలను తక్కువ చేసి చూడొద్దు: రోహిణి