Rohini: ‘సేవ్ ది టైగర్స్’లో ప్రియదర్శి భార్య క్యారెక్టర్ నాదే, ఆ పాత్రలను తక్కువ చేసి చూడొద్దు: రోహిణి
Save The Tigers 2: ఇటీవల హాట్‌స్టార్‌లో ‘సేవ్ ది టైగర్స్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఇక ఇందులో ప్రియదర్శి భార్యగా జోర్దార్ సుజాత నటించగా.. ముందుగా ఆ పాత్ర తనకే వచ్చిందని రోహినీ బయటపెట్టింది.
Rohini About Save The Tigers 2: తెలుగులో కామెడీ వెబ్ సిరీస్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటిది కామెడీ జోనర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకొని ఒక సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని మరో సీజన్ కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది ‘సేవ్ ది టైగర్స్’. గతేడాది ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల ముందుకు వచ్చింది. అది సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా సీజన్ 2 కూడా విడుదలయ్యింది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఇందులో లీడ్ రోల్స్ చేసిన అభినవ్ గోమఠం, రోహినీ ఒక ఇంటర్వ్యూలో కలిసి పాల్గొన్నారు. అందులో ‘సేవ్ ది టైగర్స్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అభినవ్, రోహినీ కాంబినేషన్ అదుర్స్..
‘సేవ్ ది టైగర్స్’లో ప్రియదర్శి, అభినవ్, కృష్ణ చైతన్య హీరోలుగా నటించగా.. సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని.. వారికి పార్ట్‌నర్స్‌గా నటించారు. ఇక రోహినీ అభినవ్ ఇంట్లో పనిమనిషిగా నటించింది. కానీ అభినవ్, రోహినీ కాంబినేషన్ సీన్స్ అయితే ఓ రేంజ్‌లో ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ముందుగా ప్రియదర్శి భార్య క్యారెక్టర్ చేసే అవకాశం తనకు వచ్చిందని అసలు విషయాన్ని బయటపెట్టింది రోహినీ. ‘‘దేవుడు మనకు ఏది కరెక్టే అదే రాసిపెడతారన్నట్టు నాకు లక్కీగా పనిమనిషి క్యారెక్టర్ వచ్చింది. ఆ పాత్ర సుజాతకే బాగా సెట్ అయ్యింది. నాకు ముందు అడిగినప్పుడు డేట్స్‌లో ఇబ్బంది వచ్చింది. తర్వాత సుజాతను అప్రోచ్ అయ్యారు. డబ్బింగ్ సమయంలో వారి సీన్స్ చూశాను. దానికి నువ్వే కరెక్ట్ అని సుజాతకు కూడా చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది రోహినీ.
తక్కువగా చూడొద్దు..
‘‘ఎక్కువశాతం అన్ని సినిమాల్లో పనిమనిషి క్యారెక్టర్లే చేస్తున్నాను. కానీ ఇంత ఎక్కువసేపు ఉండడం, ఎక్కువ సీన్లు చేయడం ఎక్కడా చేయడం లేదు. చెప్పాలంటే ఎవరూ రాయడం లేదు. సిరీస్ కాబట్టి మాకు అలా కుదిరింది’’ అంటూ తన పాత్ర వల్ల తనకు తృప్తి కలిగిందని తెలిపింది రోహినీ. ఇక అభినవ్ కూడా తనతో వర్క్ చేయడం బాగుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘సేవ్ ది టైగర్స్’లో తన క్యారెక్టర్ గురించి మరింత వివరంగా చెప్పుకొచ్చింది రోహినీ. ‘‘ఆ పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. పనిమనిషి క్యారెక్టర్లను తక్కువగా చూడాలని ఏం లేదు. చేయొచ్చు అనుకుంటే అభినవ్ లాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు’’ అంటూ పనిమనిషి క్యారెక్టర్లను తక్కువ చేసి చూడొద్దని అన్నారు రోహినీ, అభినవ్.
హాలీవుడ్ సిరీస్‌లు అంతే..
‘సేవ్ ది టైగర్స్’ మొదటి సీజన్‌ను తేజ కకుమాను డైరెక్ట్ చేయగా.. సెకండ్ సీజన్ డైరెక్షన్ బాధ్యతలు వేరొకరి చేతికి వెళ్లాయి. దానిపై అభినవ్ స్పందించాడు. హాలీవుడ్ సిరీస్‌లలో ఒక్కొక్క ఎపిసోడ్‌కు ఒక్కొక్క డైరెక్టర్ ఉంటాడంటూ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను ఉదాహరణగా తీసుకున్నాడు. అలా వారి స్నేహం వల్లే ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1లాగానే సీజన్ 2 కూడా హిట్ అయ్యిందని అన్నాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశామని తెలిపారు రోహినీ, అభినవ్. లాంచ్ పంచ్ ఎవరిది అని ఇద్దరం పోటీపడతామని బయటపెట్టింది. ప్రస్తుతం ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 చూసిన ప్రేక్షకులు కూడా వీరిలాగానే ఎంజాయ్ చేస్తూ సిరీస్‌కు పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు.
Also Read: వామ్మో, 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ అన్ని కోట్లు పెట్టిందా?