By: ABP Desam | Updated at : 29 Jun 2022 12:37 PM (IST)
సూర్య
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూసే పురస్కార వేడుక 'ఆస్కార్స్'. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇచ్చే అవార్డు చాలా మంది ఎంతో గొప్పగా భావిస్తారు. ఆస్కార్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం కూడా గౌరవంగా భావిస్తారు. అటువంటి గౌరవం ఈ ఏడాది సూర్యకు దక్కింది.
ఆస్కార్స్ 2022... ఈ ఏడాది పురస్కార వేడుక కమిటీలో మొత్తం 397 మందికి చోటు కల్పించారు. క్లాస్ ఆఫ్ 2002గా పిలవబడే ఈ కమిటీలో సూర్య శివకుమార్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, ఫిమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియాను రిప్రజెంట్ చేయనున్నారు.
తమిళ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్స్ కమిటీలో చోటు దక్కించుకున్న తొలి నటుడిగా సూర్య రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. ఆ రెండిటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
సినిమాలకు వస్తే... ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నారు. జూలై 1న విడుదల కానున్న 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'లో అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన హిట్ సినిమా 'ఆకాశమే నీ హద్దురా' హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతోంది. అందులో అతిథి పాత్ర చేయడంతో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నారు సూర్య.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్వి, వారసుడొచ్చాడు
Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!
Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!
Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను
Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్