Actor Sivaji Raja: మోహన్ బాబుకు, నాకు పడదు - అయినా నా కోసం అలా చేశారు: శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!
Actor Sivaji Raja: నటుడు శివాజీ రాజా గురించి అందరికీ తెలిసిందే.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చారు.. అవేమిటో చూద్దాం!
Actor Sivaji Raja: శివాజీ రాజా హీరోగా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఆయన కమెడియన్ గానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందారు. అలాగే, కొన్ని సీరియల్స్‌లో నటించడమే కాకుండా.. నిర్మాతగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ద్వారా మరింత ఫేమస్ అయిన శివాజీ రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విశేషాలను పంచుకున్నారు.
నిర్మాతగా ఏమీ సంపాదించలేకపోయా
‘‘ప్రొడ్యూసర్ గా ఏమీ సంపాదించలేకపోయాను. నేను ఏ రోజు పేమెంట్స్ ఆరోజు ఇచ్చేసేవాడిని. ఈ విషయంలో నాకు నిర్మాత రాజేంద్రప్రసాద్ ఇన్స్పిరేషన్. ఆయన ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఆయన మాత్రం పెద్దగా ఏం సంపాదించుకున్నారని, ఆయన కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు. అయినా నేను కూడా పెద్దగా పోగొట్టుకున్నదేమీ లేదు. షూటింగులు అవి మానుకొని నేను సీరియల్స్ ప్రొడ్యూస్ ఏమీ చేయలేదు. కాకపోతే మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి ఒకచోట ఉంటే అదొక ఆనందం’’ అని తెలిపారు శివాజీ రాజా.
ఇండస్ట్రీకి చాలా చేశాను
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో పాల్గొన్నప్పుడు శక్తివంచన లేకుండా కష్టపడ్డాను. ఆ మూమెంట్ ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ఎంతో ఇష్టపడి పని చేశాను. పదవిలో లేకపోయినా కూడా ఇప్పుడు నన్ను చాలామంది గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అది చాలా ఆనందించాల్సిన విషయం. రెండుసార్లు ఈసీఈ మెంబరు, రెండుసార్లు ట్రెజర్లో, రెండు సార్లు వైస్ ప్రెసిడెంట్గా, రెండు సార్లు జనరల్ సెక్రెటరీ ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను మాత్రమే చేయగలను అనే పనులు చాలా చేశాను. ఎవరు చేయలేని పనిని కూడా నేను చేశాను. అమెరికా వెళ్తే ఇంత డబ్బు వస్తుంది అని తెలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి అడిగితే నువ్వు ఎప్పుడూ ఏమీ అడగలేదు నేను వస్తాను అని చెప్పారు. మనం ఏదైనా మంచి పని చేస్తున్నాము అంటే శత్రువులు ఉంటారు కదా ఇబ్బందులు పెట్టటానికి’’ అని తెలిపారు.
చాలా ఇబ్బందులు పెట్టారు
‘‘ వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే నేను, శ్రీకాంత్ కలిసి వెళ్లి చిరంజీవి గారితో ఇలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్తే.. మీరు చేయాలనుకున్నారు కదా చేసేయండి. నేను వస్తాను అని చెప్పారు. అలాగే మోహన్ బాబు గారికి కూడా నేనంటే పడదు. అలాగే ఆయనంటే నాకు కూడా పడదు. అలాంటిది ఆయన కూడా నా కోసం వచ్చారు. అప్పుడు కూడా అందరూ కాంట్రవర్సీ చేశారు. చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా బిజినెస్ క్లాసులో తీసుకువెళ్లాం అని వాళ్ళు వాదిస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఆలీ లాంటి పెద్ద యాక్టర్ కూడా ఎకనామిక్ క్లాస్ లోనే వచ్చాడు’’ శివాజీ పేర్కొన్నారు.
Also Read : ‘భీమా’ టీజర్: బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు, దున్నపోతుపై గోపిచంద్ ఎంట్రీ అదుర్స్