![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్లు తెలిసింది. సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్ళు హోటళ్లలో ఉన్న ఆయన ఇప్పుడు సొంత ఇంట్లో అడుగు పెట్టారట.
![Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య! Actor Naga Chaitanya buys new luxurious home in Hyderabad Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/18/9d9352f8cdc26fbdd757ea1a6f2d5a8c1679124705168313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) తన కలల ఇంటిలో అడుగు పెట్టినట్లు తెలిసింది. సమంత (Samantha )తో విడాకులకు కొన్ని రోజుల ముందు హైదరాబాద్ సిటీలోని ఓ ప్రముఖ హోటల్‌కు ఆయన షిఫ్ట్ అయ్యారు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న పెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈసారి అపార్ట్మెంట్ కాకుండా తనకు ఇష్టంగా ఓ ఇల్లు కట్టించుకున్నారని, అదీ తన తండ్రి కింగ్ అక్కినేని నాగార్జున ఇంటికి సమీపంలోనే అని తెలిసింది.
ఆ ఇంటిలోనే సమంత
సమంతతో వివాహమైన తర్వాత నటుడు మురళీమోహన్ ఫ్యామిలీకి చెందిన గేటెడ్ కమ్యూనిటీలో, బహుళ అంతస్థుల భవనంలోని ఓ పెంట్ హౌస్ తీసుకున్నారు చై. సంసార జీవితంలో సమస్యలు ఏర్పడి, విడాకులు తీసుకున్నాక... ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆ ఇంటిలో సమంత ఉంటున్నారు. పెట్ డాగ్స్ కూడా ఆమె దగ్గర ఉన్నాయి. విడాకుల సమయంలో ఆ పెంట్ హౌస్ విషయంలో ఏం ఒప్పందం జరిగిందో కానీ... నాగ చైతన్య కొత్త ఇల్లు కట్టుకున్నారు.
పది రోజుల క్రితం గృహప్రవేశం చేసిన చై!?
Naga Chaitanya New House : పది రోజుల క్రితం కొత్త ఇంటిలోకి నాగ చైతన్య అడుగు పెట్టారట. తండ్రి ఇంటికి దగ్గరలో, తన అభిరుచికి తగ్గట్టు... స్విమ్మింగ్ ఫూల్, మినీ థియేటర్, జిమ్ వంటివి ఉండేలా చూసుకున్నారట. అయితే, కొత్త ఇల్లు విషయంతో పాటు గృహ ప్రవేశం చేసిన సంగతి కూడా రహస్యంగా ఉంచారు. సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను వీలైనంత లో ప్రొఫైల్ లో ఉంచాలని అక్కినేని ఫ్యామిలీ డిసైడ్ అయిందట.
Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?
సినిమాలకు వస్తే... నాగ చైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా 'కస్టడీ' (Custody Movie). తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ చిత్రమిది. ఇటీవల టీజర్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్.
మే 12న విడుదల
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. మే 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : వెంకట్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, యాక్షన్ : మహేష్ మాథ్యూ, కళా దర్శకత్వం : డివై సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు.
Also Read : సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)