Pawan Kalyan: పవర్ స్టార్‌తో పవర్ ఫుల్ స్నాప్ - 'ఓజీ'తో అర్జున్ దాస్.. వాట్ ఏ మూమెంట్ సార్!
Ajrun Das: పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' షూటింగ్ సెట్‌లో యాక్టర్ అర్జున్ దాస్ సెల్ఫీ తీసుకున్నారు. ఇది లైఫ్ లాంగ్ తనకు గుర్తుంటుందంటూ అర్జున్ పవర్ ఫుల్ స్నాప్స్ షేర్ చేశారు.

Arjun Das Selfie With Pawan Kalyan In OG Sets: పవన్ కల్యాణ్ అవెయిటెడ్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ మూవీ కంప్లీట్ చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ సెట్స్‌లోకి వెళ్లాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో బిజీగా మారడంతో కమిట్ అయిన మూవీస్‌ను త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.
పవన్‌తో ఓ సెల్ఫీ
ప్రస్తుతం పవన్ 'ఓజీ' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓజీ నటుడు అర్జున్ దాస్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఎంతో ఆప్యాయంగా పవన్ ఆయన్ను హగ్ చేసుకున్నారు. పవన్‌ను ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చటించి ఇలా ఫోటోలు దిగారు. ఈ పవర్ ఫుల్ స్నాప్స్‌ను సోషల్ మీడియా వేదికగా అర్జున్ దాస్ పంచుకున్నారు. ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
It has been an absolute honour @PawanKalyan Garu. Will cherish every single day of working with you. Thank you for taking time out whenever we shot, to sit down & talk to me despite your extremely busy schedule. Will forever cherish our conversations. I truly hope I get to… pic.twitter.com/zBa7dhXf5j
— Arjun Das (@iam_arjundas) June 6, 2025
'ఇది నాకు లభించిన గౌరవం. మీతో పని చేస్తోన్న ప్రతీ రోజునీ నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మీ బీజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. మనం ఎప్పుడు షూటింగ్‌లో కలిసినా నా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి నాతో కూర్చుని మాట్లాడుతుంటారు. ఇవి నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. చాలా థాంక్స్ సార్. నేను మళ్లీ మీతో కలిసి పని చేయాలని ఉంది సార్.' అంటూ ట్వీట్ చేశారు.
వాయిస్ ఓవర్ అదుర్స్
ఇక 'ఓజీ' మూవీలో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషించగా.. సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆయన వాయిస్ ఓవర్‌తోనే రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ బేస్ వాయిస్‌లో అర్జున్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. 'వాడు నరికిన మనుషుల రక్తాన్ని.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే..' అంటూ సాగే డైలాగ్స్ వేరే లెవల్. తన డబ్బింగ్‌తోనే తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు అర్జున్ దాస్. తాజాగా.. ఓజీ సెట్‌లో పవన్‌తో తన బెస్ట్ మూమెంట్‌ను ఇలా షేర్ చేసుకున్నారు.
ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య 'ఓజీ' మూవీని నిర్మిస్తుండగా.. ముంబయి మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, గ్లింప్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.





















