అన్వేషించండి

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kritisanon Allu Arjun: బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ మరోసారి బన్నీతో నటించాలని ఉందంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kritisanon About Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kritisanon) ఈ ఏడాది 'ఆదిపురుష్' (Adipurush) మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్లాప్ అయినా ఇందులో  సీత పాత్రలో కృతి సనన్ నటన ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఈ ఏడాది ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి కృతి సనన్ దిగిన ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదే సమయంలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని కూడా చెప్పింది. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్.

"అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పనిచేసే క్షణం కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా" అంటూ మరోసారి తన మనసులో కోరికను బయట పెట్టింది కృతి సనన్.

బన్నీతో కలిసి నటించాలని ఉందని ఈ హీరోయిన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు. తనకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందిస్తూ బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘మీతో కలిసి నటించాలని ఉంది’’ అంటూ రిప్లై ఇచ్చింది. అలా సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో కృతి సనన్ కామెంట్స్‌కి ఏకీభవిస్తూ ఫ్యాన్స్ సైతం మీకు కచ్చితంగా బన్నీతో నటించే ఛాన్స్ వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇదిలా ఉంటే కృతి సనన్ ఈమధ్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను నిర్మాతగా తీస్తున్న ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. "మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నిర్మిస్తున్న 'దో పత్తి' అనే సినిమా సవాళ్లతో కూడుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా" అని చెప్పుకొచ్చింది కృతి సనన్. ఇక చివరిగా 'ఆదిపురుష్'(Adipurush) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు ప్రాజెక్టులు చేస్తోంది. ఓవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Also Read : లయ, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, ఆ కారణంతో ఆగిపోయింది: నటుడు సాయి కిరణ్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget