అన్వేషించండి

Abhishek Bachchan : విడాకుల వార్త‌ల‌పై స్పందించిన అభిషేక్ బ‌చ్చ‌న్.. చివరికి అలా చెప్పుకోవల్సి వస్తోంది

Abhishek Bachchan : ప్ర‌స్తుతం హాట్ టాపిక్ ఐశ్వ‌ర్య రాయ్, అభిషేక్ బ‌చ్చ‌న్ విడాకులు. అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లికి ఇద్ద‌రు విడివిడిగా రావ‌డంతో వార్త వైర‌ల్ అయ్యింది. దానిపై క్లారిటీ ఇచ్చారు అభిషేక్.

Abhishek Bachchan Reacts To Rumours Of Divorce From Aishwarya Rai Bachchan: బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. భాష ఏదైనా, సెల‌బ్రిటీ ఎవ‌రైనా రూమ‌ర్స్ క‌చ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఒక్కోసారి వాళ్ల‌పై వ‌చ్చిన రూమ‌ర్స్ విని, న‌వ్వి వ‌దిలేస్తారు చాలామంది సెల‌బ్రిటీలు. ఒక్కోసారి క్లారిటీ ఇచ్చేస్తుంటారు. ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియాలో, బాలీవుడ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న వార్త ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ విడాకులు. అయితే, ఈ రూమ‌ర్ ఇప్పుడు పుట్టింది కాదు.. చాలా రోజుల నుంచి దీనిపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి నుంచి ఇంకాస్త బ‌ల‌ప‌డ్డాయి. అయితే, ఆ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చాడు అభిషేక్ బచ్చ‌న్. ఆయ‌న ఏమ‌న్నారంటే? 

చాలా రోజుల నుంచి.. 

ఐశ్వ‌ర్యరాయ్, అభిషేక్ బ‌చ్చ‌న్ ఇద్ద‌రూ విడిపోయార‌ని, విడివిడిగా ఉంటున్నార‌ని, డైవ‌ర్స్ తీసేసుకున్నార‌నే వార్త‌లు గ‌త కొద్దికాలంలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఆ వార్త‌ల‌పై అటు ఐశ్వ‌ర్య కానీ, ఇటు బ‌చ్చ‌న్ ఫ్యామిలీ కానీ ఎవ్వరూ  క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆ వార్త‌ల‌ను ఖండించ‌నూ లేదు. ఈ మ‌ధ్య అంబానీ ఇంట జ‌రిగిన పెళ్లికి సెల‌బ్రిటీలంతా హాజ‌ర‌య్యారు. వాళ్ల‌లో బ‌చ్చ‌న్ ఫ్యామిలీ కూడా ఉంది. అయితే, ఐశ్వ‌ర్య రాయ్, త‌న కూతురు మాత్రం బ‌చ్చ‌న్ ఫ్యామిలీతో కాకుండా విడిగా హాజ‌ర‌య్యారు. దీంతో ఆ రోజు నుంచి విడాకుల వార్త‌ల‌కు ఇంకాస్తా ఆజ్యం పోసిన‌ట్లు అయ్యింది. ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చారు అభిషేక్ బ‌చ్చ‌న్. ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. 

మీకు వార్త‌లు కావాలి.. రాసేశారు

విడాకుల వార్త‌పై అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న త‌న వెడ్డింగ్ రింగ్ ని చూపిస్తూ క్లారిటీ ఇచ్చారు. "నాకు పెళ్లైంది. దాని గురించి నేను ఏం చెప్పాల‌ని అనుకోవ‌డం లేదు. బాధేంటంటే మీరంతా ఒక వార్త‌ను ప్ర‌చారం చేసేశారు. అలా ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు.. మీకు ఒక వార్త కావాలి. అలా రాసేశారు. ప‌ర్లేదు.. మేం సెల‌బ్రిటీలు కాబ‌ట్టి అన్ని భ‌రించాలి క‌దా" అని చెప్పారు అభిషేక్ బ‌చ్చ‌న్. 

పోస్ట్ లైక్ చేయ‌డంతో.. 

నిజానికి చాలా రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అభిమానులు ఆ వార్త‌ల‌ను పెద్ద‌గా న‌మ్మ‌లేదు. కానీ, అంబానీ ఇంట పెళ్లిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌, ఆ త‌ర్వాత గ్రే డివొర్స్ కి సంబంధించి ఒక పోస్ట్ ని అభిషేక్ బ‌చ్చ‌న్ లైక్ చేయ‌డంతో నిజంగానే డివొర్స్ తీసుకుంటున్నారేమో అని అనుకున్నారు అభిమానులంతా. దీంతో వాళ్ల మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌ని న‌మ్మేశారు. ఐశ్వ‌ర్య రాయ్ త‌మ పెళ్లి రోజు సంద‌ర్భంగా కేవ‌లం వాళ్ల ఎంగేజ్మెంట్ ఫొటో షేర్ చేసి, దానికి ఎమోజీల‌ను మాత్ర‌మే జోడించ‌డంతో ఏదో తేడాగా ఉందేటీ అని అంతా అనుకున్నారు. అందుకే అభిషేక్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

2007లో పెళ్లి.. 

అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య రాయ్ ఇద్ద‌రూ బాలీవుడ్ న‌టులు. ఇద్ద‌రు క‌లిసి 'గురు', 'ధాయ్ అక్ష‌ర్ ప్రేమ్ కీ', 'కుచ్ నా క‌హో', 'ధూమ్ - 2', 'ఉమ‌రో జాన్' లాంటి సినిమాల్లో న‌టించారు. ఇక వాళ్లిద్ద‌రికీ 007లో వివాహం జ‌రిగింది. 2011 న‌వంబ‌ర్ లో పాప పుట్టింది. పాప పేరు ఆరాధ్య‌. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇద్ద‌రు 17వ వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు.

Also Read: కంగువ ట్రైలర్... బాహుబలి రేంజ్‌లో సూర్య సినిమా - యాక్షన్, విజువల్స్ కుమ్మేశాయి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget