Aamir Khan: ఏడుపును కంట్రోల్ చేసుకోలేను - నా కూతురు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తోడున్నది అతడే: అమీర్ ఖాన్
కూతురి నిశ్చితార్థం జరిగి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇంకా పెళ్లి తేదీ రివీల్ చేయలేదు అనే కామెంట్స్‌కు అమీర్ ఖాన్ చెక్ పెట్టాడు.
బాలీవుడ్‌లో యంగ్ నటీనటుల పెళ్లి ఈమధ్య కామన్‌గా మారిపోయింది. గత రెండేళ్లలో ఎంతోమంది యంగ్ నటీనటులు పెళ్లిపీటలు ఎక్కారు. అయితే బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ కూడా తన కూతురిని పెళ్లి పీటలెక్కించనున్నాడు. ఇప్పటికే అమీర్ ఖాన్.. తన కూతురు ఐరా ఖాన్‌కు తనకు నచ్చిన అబ్బాయితోనే నిశ్చితార్థం చేశాడు. ఇక ఈ నిశ్చితార్థం జరిగి దాదాపు సంవత్సరం అవుతున్నా ఐరా పెళ్లి ఎప్పుడు అనే విషయం క్లారిటీ లేదు. తాజాగా అమీర్ ఖాన్.. ఐరా పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని బయటపెట్టాడు. అంతే కాకుండా తన ముద్దుల కూతురి పెళ్లికి తను ఎలా ఫీలవుతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.
పెళ్లి తేదీ రివీల్..
గతేడాది నవంబర్ 18న అమీర్ ఖాన్, తన మాజీ భార్య రీనా దత్తా కూతురు ఐరా ఖాన్‌కు నిశ్చితార్థం జరిగింది. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖారేతో ఐరా ఖాన్ ఎన్నో ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇక తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పి ఒప్పించి తనతో నిశ్చితార్థం చేసుకుంది. అయితే నిశ్చితార్థం జరిగి ఇన్ని నెలలు కావస్తున్న వీరి పెళ్లి తేదీపై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్.. తన కూతురు ఐరా పెళ్లి తేదీని రివీల్ చేశాడు. ‘‘జనవరి 3న ఐరా పెళ్లి చేసుకోనుంది. తను సెలక్ట్ చేసుకున్న అబ్బాయి ముద్దుపేరు పాపేయ్. అతను ఒక ట్రైనర్. అతడి ఖండలు పాపేయ్‌లాగా ఉంటాయి కానీ తన పేరు మాత్రం నుపూర్. చాలా మంచివాడు.’’ అంటూ ఐరా పెళ్లి తేదీ గురించి బయటపెట్టాడు అమీర్.
అల్లుడు కాదు.. కొడుకు..
తనకు కాబోయే అల్లుడు నుపూర్ గురించి చాలా గొప్పగా చెప్పాడు అమీర్ ఖాన్. ‘‘ఐరా డిప్రెషన్‌తో బాధపడుతున్న సమయంలో నుపూర్ తనతో ఉన్నాడు. తన పక్కనే నిలబడ్డాడు. తనకు మానసికంగా సపోర్ట్‌గా ఉన్నాడు. కలిసి సంతోషంగా ఉండగలిగే మనిషిని ఐరా సెలక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు చాలా కనెక్ట్ అయిపోయారు. వారిద్దరూ ఒకరిని ఒకరు జాగ్రత్తగా చూసుకుంటారు, కేర్ చూపించుకుంటారు’’ అని చెప్పుకొచ్చాడు అమీర్. అంతే కాకుండా చెప్పడానికి సినిమాటిక్‌గా ఉన్నా కూడా నుపూర్.. నా కొడుకు లాంటి వాడు అనే డైలాగ్ కూడా కొట్టాడు అమీర్.
నా ఏడుపును కంట్రోల్ చేసుకోలేను..
‘‘నుపూర్ చాలా మంచివాడు. అతడు మా కుటుంబంలో ఒకడని మేము ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాము. తన తల్లి ప్రీతమ్ గారు అయితే ఇప్పటికే మా కుటుంబంలో ఒక భాగమే. నేను చాలా ఎమోషనల్. నేను పెళ్లిరోజు కచ్చితంగా చాలా ఏడుస్తాను. అమీర్‌ను చాలా ఓదార్చాలి ఆరోజు అంటూ కుటుంబంలో అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ కాబట్టి. నేను నా నవ్వును మాత్రమే కాదు.. నా ఏడుపును కూడా కంట్రోల్ చేసుకోలేను.’’ అంటూ అమీర్ ఖాన్ బయటపెట్టాడు. ఐరా ఖాన్.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే స్టార్ కిడ్స్‌లో ఒకరు. తన డిప్రెషన్ దగ్గర నుండి నుపూర్‌తో తన రిలేషన్‌షిప్ వరకు.. ఇలా అన్ని విషయాలు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఐరా. ఇప్పటికే తను నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.
Also Read: ప్రభాస్ 'కల్కి'లో అమితాబ్ బచ్చన్ లుక్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial