By: ABP Desam | Updated at : 15 Mar 2022 09:18 AM (IST)
ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు మందు (ఆల్కహాల్) అలవాటు ఉందని తెలుసా? అదీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు! అవును... ఆమిర్ గతంలో మందు తాగేవారు. అయితే, ఇప్పుడు మానేశారు. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మందు అలవాటు గురించి వివరించారు.
"నేను మందు తాగేవాడిని. కానీ, ఇప్పుడు తాగడం లేదు. కొంత మంది రెండు పెగ్గులు వేస్తారు. ఆ విధంగా, రెగ్యులర్ గా తాగే టైప్ కాదు నేను. అప్పుడప్పుడూ మాత్రమే తాగేవాడిని. అయితే, ఒక్కసారి కూర్చుంటే ఫుల్ బాటిల్ ఖాళీ అవ్వాల్సిందే. నాకు అది మంచిగా అనిపించలేదు. మత్తులో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల, మాట్లాడే మాటల వల్ల ఆ తర్వాత బాధపడతాం. నా విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. కానీ, మందులో ఉన్నప్పుడు మనిషి కంట్రోల్ లో ఉండదు. అందువల్ల, నేను మందు మానేశాను" అని ఆమిర్ ఖాన్ వివరించారు.
Also Read: రామ్‌తో రష్మిక?
'సత్యమేవ జయతే' షో హోస్ట్ చేసిన ఆమిర్ ఖాన్, ఒక ఎపిసోడ్ ఆల్కహాల్ మీద చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి కూడా ఆమిర్ ఖాన్ మాట్లాడారు. "కిరణ్ రావుకు నేను అంటే ఎంతో గౌరవం. నాకూ ఆమె అంటే గౌరవం. మా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. భార్యాభర్తలుగా మా బంధంలో మార్పు వచ్చింది. కానీ, మేం కలిసి పని చేస్తున్నాం. ఒకరికి ఒకరు దగ్గరలో ఉంటున్నాం" అని ఆమిర్ తెలిపారు.
Also Read: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ భేటీ - ఇంకో #BB కాంబో రెడీ అవుతుందా?
Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?
SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!
Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!
Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!
Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?