Aadhi Pinisetty 1st Look - The Warriorr: చాలా క్రూరంగా ఉన్నాడు గురు!
Fierceful first look of menacing Aadhi Pinisetty from The Warriorr unveiled: 'ది వారియర్'లో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'గురు... వీడు చాలా క్రూరంగా ఉన్నాడు' అనేలా ఉంది కదూ ఈ లుక్! 'ది వారియర్' కోసం ఆది పినిశెట్టి ఈ లుక్‌లోకి మారారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న సినిమా 'ది వారియర్' (The Warriorr Movie). ఇందులో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'ది వారియర్'లో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'సరైనోడు' తర్వాత ఆది పినిశెట్టి చేస్తున్న ఫుల్ ఫ్లెడ్జెడ్ విలన్ రోల్ ఇదేనని చెప్పాలి. నిజం చెప్పాలంటే... 'సరైనోడు' తర్వాత చాలా విలన్ రోల్స్ వచ్చినా ఆయన 'నో' చెప్పారని, గురు పాత్ర వినగానే వెంటనే ఓకే చెప్పేశారని 'ది వారియర్' చిత్రవర్గాలు తెలిపాయి.
ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ది వారియర్' సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "ఆది పినిశెట్టి లుక్ విడుదలైన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. గురు పాత్రకు ఆది పినిశెట్టి 100 శాతం యాప్ట్. 'సరైనోడు'లో ఆయన చేసిన పాత్ర కంటే పదింతలు పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రామ్ - ఆది మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయి" అన్నారు. దర్శకుడు లింగుస్వామి సైతం రామ్ - ఆది పినిశెట్టి మధ్య సన్నివేశాలు నువ్వా - నేనా అన్నట్టు ఉంటాయని తెలిపారు.
Also Read: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పాన్ ఇండియా సినిమా, ఇదిగో అఫీషియల్ అనౌన్స్‌మెంట్
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఆయన సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆమె ఆర్జే విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఇంకా అక్షరా గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: యూట్యూబ్‌లో ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌతిండియన్ హీరో రామ్
Every Warrior has a Foe.🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) March 1, 2022
Here is "Guru", the ultimate Foe of #TheWarriorr ⚔️#HappyMahashivratri @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @iAksharaGowda @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/aJfkuezvDu