Allu Arjun - Vijay Sethupathi: అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి... గట్టిగా ప్లాన్ చేసిన అట్లీ!
AA22xA6 Latest Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో విజయ్ సేతుపతి నటించనున్నారని టాక్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తూ... భారీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Director Atlee Kumar) దీనిని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సైతం నటించనున్నట్లు తమిళ సినిమా వర్గాల కథనం. ఆ వివరాల్లోకి వెళితే...
అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి!?
Vijay Sethupathi to play guest role in AA22xA6: తమిళంలో విజయ్ సేతుపతి పాపులర్ స్టార్. తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన 'ఉప్పెన'లో హీరోయిన్ కృతి శెట్టి తండ్రి పాత్ర చేశారు. తమిళంలోనూ ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూ మరొక వైపు కొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా (బెగ్గర్?) చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న బన్నీ సినిమాలో నటించనున్నారని టాక్.
తెలుగు, తమిళ భాషలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సేతుపతిని దర్శకుడు అట్లీ కుమార్ కలిశారట. తమ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందని, అందులో నటించమని అడిగారట. అంటే అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతిది అతిథి పాత్ర అన్నమాట.
విజయ్ సేతుపతికి, అట్లీకి మంచి అనుబంధం ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. హిందీలో ఆయనకు ఆ క్యారెక్టర్ మంచి పేరు తీసుకువచ్చింది. హిందీ ప్రేక్షకులలో ఆయనకు అభిమానులు ఏర్పడేలా చేసింది. ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతిని తన సినిమాలోకి తీసుకోవడానికి అట్లీ ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాను సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. ఇప్పటి వరకు మూవీ యూనిట్ అనౌన్స్ చేసిన పేరు ఆవిడది మాత్రమే. దీపిక కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు సినిమాలో ఉంటారని... ఆ పాత్రలకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 'పుష్ప'లో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మికను విలన్ పాత్ర చేయమని సంప్రదించినట్లు టాక్. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలయ్యింది. ఈ సినిమా కోసం దీపికా పదుకోన్ 100 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమాకు హాలీవుడ్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ చేయక ముందు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడి కంపెనీలతో హీరో, దర్శకుడు మాట్లాడి వచ్చారు.





















