అన్వేషించండి

A Quiet Place: Day One Trailer: ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ - ఆ రోజు ఏం జరిగింది? ఆ థ్రిల్లర్ మూవీకి ప్రీక్వెల్ వ‌చ్చేస్తోంది!

2018లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఏ క్వైట్ ఫ్లేస్’. ఈ చిత్రాన్ని ఫ్రీక్వెల్ గా వస్తున్న ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

A Quiet Place: Day One Trailer: ‘ఏ క్వైట్ ప్లేస్’. 2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.    సైన్స్ ఫిక్షన్, హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజిలో థ్రిల్ ను పంచింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చున్నారంటే, ఏ స్థాయిలో ఆకట్టుకుంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా 2020లో ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్‌ 2’ పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మూడేళ్లకు ప్రీక్వెల్ గా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ పేరుతో సినిమా అభిమానులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

వింత జీవులు భూమ్మీదకు ఎలా వచ్చాయి?

‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు పార్టులను తలదన్నేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. కళ్లు చెదిరే విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ను గమనిస్తే, స్పేస్ నుంచి కొన్ని జీవులు భూమి మీదికి వస్తాయి. భూగోళాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. చిన్న శబ్దం వినపడినా పసిగట్టి.. మనుషులను మట్టుబెడతాయి. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా ఉండటం ఒక్కటే మార్గం. ఈ భయంకర జీవుల దాడి నుంచి ఓ కుటుంబం ఎలా భయటపడింది? అనేది ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో చూపించారు మేకర్స్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూడో భాగం ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’లో అసలు ఈ వింత జీవులు భూగ్రహం మీదికి ఎలా వచ్చాయి? అవి భూమ్మీద అడుగు పెట్టిన తొలి రోజు ఏం జరిగింది? నగరాల మీద పడి ఎలా దాడి చేశాయి? అనేది చూపించబోతున్నారు. ప్రేక్షకులను సైలెంట్‌గా భయపెట్టేందుకు వచ్చేస్తోంది. 

జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’

ఇక ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు జాన్ క్రాసిన్స్కి దర్శకత్వం వహించారు. ఆయన భార్య, హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎమిలీ బ్లంట్ తో కలిసి నటించారు. మూడో భాగం ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాల్లోని నటీనటులతో పాటు  లుపిటా న్యోంగో, జోసెఫ్ క్విన్, అలెక్స్ వోల్ఫ్ ఈ చిత్రంలో భాగం అవుతున్నారు. పారామౌంట్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరగా ఈ ఏడాది జూన్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

Read Also: మోడీగా మారిన ‘రాముడు’ - ‘ఆర్టికల్ 370’లో ప్రధానిగా రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ సర్‌ప్రైజ్

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget