Business Women's Day: సినిమాల్లోనే కాదు, వ్యాపారరంగంలోనూ సత్తా చాటుతున్న బాలీవుడ్ బ్యూటీస్
సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు వ్యాపారం రంగంలోకి అడుగు పెట్టారు. అక్కడ కూడా మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను అక్షరాలా పాటిస్తున్నారు పలువురు బాలీవుడ్ తారలు. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెడుతున్నారు. అక్కడ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. తమ వ్యాపారాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు మంచి లాభాలను రాబడుతున్నారు. సెప్టెంబర్ 22 బిజినెస్ ఉమెన్స్ డే సందర్భంగా వ్యాపారాల్లో రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం..
1. అలియా భట్
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ, వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'డార్లింగ్స్', 'గంగూబాయి కతియావాడి' లాంటి హిట్స్ చిత్రాలను నిర్మించిన 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' సహ యజమానిగాగా కొనసాగుతోంది. అటు 'ఎడమామా' అనే దుస్తుల బ్రాండ్ ను కూడా ప్రారంభించింది. గర్భిణీలతో పాటు శిశువులకు సంబంధించిన దుస్తులను ఈ సంస్థ రూపొందిస్తోంది.
2. రిచా చద్దా
నటి రిచా చద్దా కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె తన భర్త అలీ ఫజల్ తో కలిసి 'పుషింగ్ బటన్స్ స్టూడియో'ని స్థాపించింది. ఇప్పటికే 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనే చిత్రాన్ని నిర్మించింది. యంగ్ టాలెంటెడ్ మేకర్స్ కు ఈ సంస్థ ద్వారా అవకాశాలు కల్పించనున్నట్లు రిచా వెల్లడించింది.
3. దీపికా పదుకొణె
ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొణె కూడా వ్యాపారం మొదలు పెట్టింది. ఆమె ఇటీవల '82E' అనే స్కిన్ కేర్ బ్రాండ్ ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ బ్రాండ్ మార్కెట్ లో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో తన బ్రాండ్ ప్రచారం కోసం షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి సూపర్ స్టార్‌లను రంగంలోకి దించింది. ఆమె ఇటీవల ప్రముఖ కాఫీ బ్రాండ్ బ్లూ టోకైలో కూడా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
4. త్రినా కైఫ్
అందం, అభినయానికి పెట్టింది పేరు అయిన కత్రినా కైఫ్ మేకప్, స్కిన్ కేర్ బ్రాండ్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'కే బ్యూటీ' పేరుతో ప్రారంభించిన ఈ సంస్థకు సహ యజమానిగా కొనసాగుతోంది. ఈ బ్రాండ్ బ్యూటీ ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంది.
5. నేహా ధూపియా
బాలీవుడ్ లో నేహా ధూపియా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా, నటిగా, నిర్మాతగా తన ప్రస్తానాన్ని కొనసాగించింది. 'బిగ్ గర్ల్ ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా నిర్మించిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేహాకు చెందిన ప్రముఖ ఆడియో షో, 'NoFilterNeha' దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాడ్ కాస్ట్‌లలో ఒకటిగా నిలిచింది.
6. ప్రియాంక చోప్రా
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక సినిమాల్లో రాణించడంతో పాటు పలు వ్యాపారాల్లో రాణిస్తోంది. ఇప్పటికే 'అనోమలీ' అనే హెయిర్ కేర్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఉత్పత్తికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. అటు విలాసవంతమైన డిన్నర్‌వేర్‌ను అందించే 'సోనా హోమ్'ను కూడా రన్ చేస్తోంది.
Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial