News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

హీరోయిన్ అవికా గోర్ తాజాగా '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

FOLLOW US: 
Share:

‘చిన్నారి పెళ్లికూతురు’ అనే సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికాగోర్ ఆ తర్వాత రాజ్ తరుణ్ సరసన 'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మామ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారిగది' వంటి సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా 'పాప్ కార్న్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అవికా గోర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా ఓ హారర్ ఫిలింతో కావడం విశేషం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్టర్ చేసిన హారర్ మూవీ ‘1920’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 2008లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అవికాగోర్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమాకు విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీకి ప్రముఖ రచయిత దర్శకుడు మహేష్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో 'రాజు గారి గది 3' సినిమాలో అవికాగోర్ దెయ్యం గా భయపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 1920 హారర్ ఆఫ్ ది హార్ట్ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ అయితే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముఖ్యంగా టైలర్ లో చూపించిన విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా భయపెట్టే విధంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివరలో కట్ చేసిన షాట్ తో మరింత భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక జూన్ 23న ఈ సినిమా హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ దర్శకురాల కృష్ణ భట్ తన సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి పలు ఆసక్తికర పోస్టులు పెట్టింది. ఈ మేరకు తన పోస్టులో పేర్కొంటూ.. "నా జీవితాన్ని మార్చేసి నన్ను దర్శకురాలుగా మార్చిన చిత్రం 1920. మళ్లీ దశాబ్దం తర్వాత నేను 1920 హారర్ ఆఫ్ ది హార్ట్ ని అవికా గోర్ తో డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా చేయడం ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఈ సినిమాని నాపై ఉన్న ప్రేమతో నా గురువులు విక్రమ్ మరియు మహేష్ భట్ రాసి, నిర్మిస్తున్నారు" అంటూ పోస్ట్ చేసింది. మరి ఈ సినిమా దర్శకురాలిగా కృష్ణ భట్ కి, హీరోయిన్ గా అవికా గోర్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. ఇక అవికాగో రీసెంట్ గా తెలుగులో 'పాప్ కార్న్' అనే సినిమా చేసింది. మురళీ గంధం దర్శకత్వంలో సాయి రోనక్ హీరోగా నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

Also Read: వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

Published at : 02 Jun 2023 10:18 PM (IST) Tags: Avika Gor Bollywood Debu 1920 horrors of the haert Avika Gor Horrors Of The Heart Movie 1920 Horrors Of The Heart Trailer

ఇవి కూడా చూడండి

Thalaivar 170: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

Thalaivar 170: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

Ram Charan: ముంబై సిద్ధివినాయక ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు, గణనాథుడి సమక్షంలో అయ్యప్ప దీక్ష విరమణ

Ram Charan: ముంబై సిద్ధివినాయక ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు, గణనాథుడి సమక్షంలో అయ్యప్ప దీక్ష విరమణ

Theatrical Releases : ‘మంత్‌ ఆఫ్‌ మధు’ To ‘మామా మశ్చీంద్ర’- ఈ వారం పెద్ద హిట్ కొట్టే చిన్న సినిమా ఏదో?

Theatrical Releases : ‘మంత్‌ ఆఫ్‌ మధు’ To ‘మామా మశ్చీంద్ర’- ఈ వారం పెద్ద హిట్ కొట్టే చిన్న సినిమా ఏదో?

Save The Tigers 2 : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్

Save The Tigers 2 : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్‌ సస్పెన్సన్‌ తాత్కాలికంగా రద్దు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు

హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు

నడి సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మరైన్, 55 మంది సిబ్బంది మృతి

నడి సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మరైన్, 55 మంది సిబ్బంది మృతి