(Source: ECI/ABP News/ABP Majha)
Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ ఇది విన్నారా.. ఆ రెండే బ్యాలెన్స్..
'ఆచార్య' సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేసినట్లు తెలిపారు. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని చిత్రబృందం తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
'ఆచార్య' సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేసినట్లు తెలిపారు. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని చిత్రబృందం తెలిపింది. ఆగస్ట్ 20 నుంచి చిరంజీవి.. చరణ్ మీద ఓ సాంగ్‌ను, అలాగే చరణ్, పూజా హెగ్డే మీద మరో సాంగ్‌ను చిత్రీకరిస్తామని తెలిపారు. దీంతో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
చిరంజీవిగారి పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ యాంగిల్‌లో ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టర్ కొరటాల శివ తనదైన శైలిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని గతంలో మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే..' సాంగ్, టీజర్ కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇందులో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి 'ఆర్ఆర్ఆర్' వస్తోంది. కాబట్టి 'ఆచార్య' వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడితే గనుక 'ఆచార్య' రావడం పక్కా. మరోపక్క ట్విట్టర్ లో ఫ్యాన్స్ అందరూ రిలీజ్ డేట్ చెప్పమంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : Acharya : రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. మెగాస్టార్ కు ఛాన్స్ దొరుకుతుందా..
Chiru Bobby Movie: 'డ్రైవింగ్ లైసెన్స్'ను కాపీ చేస్తున్నారా.. లేక రీమేకా.. బాబీ ఏమంటాడో..